CISF Recruitment: 1149 కానిస్టేబుల్ పోస్టుల కోసం అప్లై చేయండి
న్యూఢిల్లీ: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) కానిస్టేబుల్/ఫైర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత కలిగిన పురుష దరఖాస్తుదారులు CISF అధికారిక రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్ www.cisfrectt.inలో దరఖాస్తు చేసుకోవచ్చు.
రిక్రూట్‌మెంట్ డ్రైవ్ CISFలో మొత్తం 1149 ఖాళీలను భర్తీ చేస్తుంది. ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ మార్చి 4, 2022 సాయంత్రం 5 గంటల వరకు.
CISF రిక్రూట్‌మెంట్ 2022: విద్యా అర్హత

అభ్యర్థులు సైన్స్ సబ్జెక్ట్‌తో గుర్తింపు పొందిన బోర్డ్/యూనివర్శిటీ నుంచి క్లాస్ 12 లేదా తత్సమాన అర్హత ఉత్తీర్ణులై ఉండాలి.
CISF Recruitment 2022: వయో పరిమితి
మార్చి 4, 2022 నాటికి అభ్యర్థుల కనీస వయో పరిమితి 18 ఏళ్లు కాగా, గరిష్ట వయో పరిమితి 23 సంవత్సరాలు.
CISF Recruitment 2022: జీతం వివరాలు:
పే లెవల్-3: రూ. 21,700-69,100
CISF రిక్రూట్‌మెంట్ 2022: ఎంపిక ప్రక్రియ
అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. అభ్యర్థులు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST), OMR/కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV)/ డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ (DME), రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్(RME) కింద వ్రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేయబడతారు.
CISF Recruitment 2022 నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
(https://cisfrectt.in/notifications/Fire21_Notification_English.pdf)












Click it and Unblock the Notifications