తెలంగాణలో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్: వారంలోగా దరఖాస్తు చేయండి
హైదరాబాద్: భారత ప్రభుత్వ ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ హైదరాబాద్) తాత్కాలిక పాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానానికి సంబంధించిన వివరాలు దిగువన గమనించవచ్చు.
మొత్తం పోస్టుల సంఖ్య: 4
ఖాళీల వివరాలు: కన్సల్టెంట్ (అకౌంట్స్), అకౌంట్స్ అసిస్టెంట్, పర్చేజ్ అసిస్టెంట్
అర్హతలు: పోస్టుకు సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, బీకాం/ఎమ్‌కాం/ఎంబీఏ, సీఏ/సీఎంఏలో ఉత్తీర్ణత ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
E-mail: [email protected]
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 7, 2022.
సీఐటీడీ నోటిపికేషన్, దరఖాస్తు వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
(https://www.citdindia.org/)












Click it and Unblock the Notifications