అ వార్తలు నమ్మొద్దు: ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయలేదన్న ఎన్పీడీసీఎల్
హైదరాబాద్: ఎన్పీడీసీఎల్ (నార్తెర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్)లోపలు పోస్టుల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేశారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్ రావు తెలిపారు. దీనికి సంబంధించిన వార్తలపై వివరణ ఇచ్చారు. ఎన్పీడీసీఎల్ లో ఎలాంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వలేదని స్పష్టం చేశారు.
ఇటువంటి అసత్య వార్తలను నమ్మవద్దని అభ్యర్థులకు సూచించారు. 157 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా కల్పితమని.. అభ్యర్థులు ఇలాంటి ప్రకటనలను నమ్మవద్దని ఆయన కోరారు.

కేవలం ఆడిట్ కోసం చార్టర్డ్ అకౌంటెంట్ సంస్థల సేవల కోసం మాత్రమే ప్రకటన ఇచ్చినట్లు సీఎండీ వివరణ ఇచ్చారు. కొందరు 157 ఆడిట్ యూనిట్లను 157 పోస్టులుగా వక్రీకరించారని తెలిపారు.
ఇటువంటి వార్తల పట్ల ప్రజలు, ఉద్యోగార్థులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్ రావు. సంస్థ అధికారిక వెబ్‌సైట్ చూసి నిర్ధారించుకోవాలని ఆయన తెలిపారు.
ఇటీవల కాలంలో తెలంగాణలో వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని వార్తా సంస్థలు ఎన్పీడీసీఎల్ లోనూ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ్డాయని ప్రచురించాయి. దీంతో అభ్యర్థులు ఎలాంటి గందరగోళానికి గురికాకుండా ఎన్పీడీసీఎల్ తాజాగా వివరణ ఇచ్చింది.












Click it and Unblock the Notifications