సీఎంఏ ఫౌండేషన్ రిజల్ట్స్ రిలీజ్.. టాప్ ర్యాంకర్లుగా తెలుగు విద్యార్థులు
కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్ (CMA) ఫౌండేషన్ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICMAI) ఈ రిజల్ట్స్ ని రిలీజ్ చేసింది. విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్/ఐడెంటిఫికేషన్ నంబర్‌ను వెబ్‌సైట్‌లో ఎంటర్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు.
జూన్ 2024లో నిర్వహించిన ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. టాప్ 10 ర్యాంకుల్లో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులే ఉండటం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గుంటూరు, హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల విద్యార్థులు ఈసారి టాప్ ర్యాంకుల్లో చోటు దక్కించుకోవడం గమనార్హం.

CMA కోర్సు వివరాలు..
ICMAI నిర్వహించే CMA కోర్సు మూడు దశలుగా ఉంటుంది:
ఫౌండేషన్
ఇంటర్మీడియట్
ఫైనల్
ఈ కోర్సు ద్వారా విద్యార్థులు కాస్ట్ మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్ ప్లానింగ్, ప్రాజెక్ట్ అనాలిసిస్, బిజినెస్ డెసిషన్ మేకింగ్ వంటి కీలక రంగాల్లో నైపుణ్యం పొందుతారు. సీఏ తరహాలోనే ఇది కూడా కంపెనీలలో కీలక ఆర్థిక నిర్ణయాలపై ప్రభావం చూపగలిగే స్థాయికి వారిని చేర్చుతుంది.
CMA ఫౌండేషన్ టాపర్లు వీరే..
1వ ర్యాంక్: రియా పొద్దార్ (హావ్‌డా - పశ్చిమ బెంగాల్)
2వ ర్యాంక్: అక్షత్ అగర్వాల్ (సూరత్ - గుజరాత్)
3వ ర్యాంక్: మోహిత్ దాస్ (గుంటూరు), భవ్య అగర్వాల్ (రాజస్థాన్)
4వ ర్యాంక్: పెనుగొండ సాయి రాఘవేంద్ర రెడ్డి (గుంటూరు)
5వ ర్యాంక్: మట్టుపల్లి గాయత్రి శ్రావ్య (గుంటూరు)
6వ ర్యాంక్: మైత్రిక చొప్పర (గుంటూరు), బండి రెడ్డి మహేశ్వర్ (గుంటూరు)
7వ ర్యాంక్: సాయి విశ్వనాథ్ బొమ్మకంటి (హైదరాబాద్), విజయ శ్రీ కె (తిరునల్వేలి), ఎ.హర్షిత (హైదరాబాద్)
8వ ర్యాంక్: తోలేటి మనోజ్ఞ, పి.కౌశిక్ రాజ్, అద్దెపల్లి విజిత (మూదురూ గుంటూరు)
9వ ర్యాంక్: రంజన ఎస్ (సేలం), నంబూరి భరద్వాజ్ వర్మ (విశాఖపట్నం), కొండ్రాపు పూర్ణచందు (విశాఖ), వాజాహత్ అహ్మద్ (హైదరాబాద్), కురుబ దీక్షిత్ (గుంటూరు)
10వ ర్యాంక్: జెని కిశోర్ కుమార్ ధామెలియా (సూరత్), కాసుమంచి సాత్విక, బొబ్బా శ్రుతి (విజయవాడ), సముద్రాల సాత్విక, తలసి గౌతమ్ కుమార్ (గుంటూరు), పి. నిత్య సంతోషిని (హైదరాబాద్)












Click it and Unblock the Notifications