సీటెట్ ఫలితాలు విడుదల: ఇలా చెక్ చేసుకోండి
డిసెంబర్ 14, 15 తేదీల్లో దేశ వ్యాప్తంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) నిర్వహించిన కేంద్రీయ ఉపాధ్యాయ పరీక్ష (CTET) ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఇటీవల ప్రాథమిక కీ విడుదల చేసి జనవరి 5 వరకు అభ్యంతరాలు స్వీకరించింది సీబీఎస్ఈ. తాజాగా ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థులు తమ రూల్ నెంబర్ ఎటర్ చేసి ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ సంప్రదించి తెలుసుకోవచ్చు.
కాగా, దేశ వ్యాప్తంగా వివిధ పరీక్ష కేంద్రాల్లో సీటెట్ డిసెంబర్ పరీక్షను పేపర్-1, పేపర్-2లను రెండు సెషన్లలో నిర్వహించిన విషయం తెలిసిందే. దాదాపు 15 లక్షల మందికిపైగా రిజిస్టర్ చేసుకున్నారు. సీటెట్‌లో సాధించిన స్కోర్‌కు జీవిత కాలం వ్యాలిడిటీ ఉంటుంది.
సీటెట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. https://cbseresults.nic.in/CtetDec24/CtetDec24q.htm

ఓయూ పరిధిలో ఎంఈ, ఎంటెక్ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఈ, ఎంటెక్ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో వెల్లడించారు. అన్ని విభాగాల ఎంఈ, ఎంటెక్ కోర్సుల రెండో సెమిస్టర్ మెయిన్, బ్యాక్‌లాగ్, మొదటి, మూడో సెమిస్టర్ మేకప్ పరీక్షలను జనవరి 18వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చన్నారు.
డిగ్రీ కోర్సుల పరీక్షల ఫలితాల విడుదల
ఉస్మానియా విశ్వవిధ్యాలయం పరిధిలోని వివిధ డిగ్రీ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీబీఏ, బీకామ్, బీఎస్సీ తదితర కోర్సుల మూడు, ఐదో సెమిస్టర్ రెగ్యూలర్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications