సీయూఈటీ యూజీ 2024 రిజ‌ల్ట్స్ వ‌చ్చేసాయ్‌.. ఇలా చెక్ చేసుకోండి!

అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. సీయూఈటీ యూజీ 2024 ఫ‌లితాలు వ‌చ్చేసాయ్‌.. ఈ ప‌రీక్ష రాసిన అభ్య‌ర్థులు సీయూఈటీ యూజీ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి త‌మ ఫ‌లితాల‌ను చెక్ చేసుకోగ‌ల‌రు. దేశంలోని వివిధ కాలేజీలు, యూనివర్సిటీల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం సీయూఈటీ యూజీ ప్ర‌వేశ ప‌రీక్షను నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఇక‌, వీటి ఫ‌లితాల‌ను తాజాగా విడుద‌ల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పరీక్ష‌కు హాజ‌ర‌యిన అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ, ఈమెయిల్, మొబైల్ నెంబరు వివరాలు నమోదుచేసి ఫలితాలను చెక్ చేసుకోగ‌ల‌రు.

సీయూఈటీ యూజీ 2024 నోటిఫికేషన్‌ను ఎన్‌టిఎ ఫిబ్రవరి 27వ తేదిన విడుదల చేసిన విష‌యం విదిత‌మే. ఈ ప‌రీక్ష‌కు ఫిబ్రవరి 27 వ తేది నుంచి మార్చి 26 వరకు అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ద‌ర‌ఖాస్తుల స‌వ‌ర‌ణ‌కు మార్చి 28, 29 తేదీల్లో అవకాశం కల్పించారు. ఈ ప‌రీక్ష‌లో సాధించిన స్కోరు ఆధారంగా దేశంలోని కేంద్రీయ వర్సిటీలతోపాటు, ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీల్లో సైతం ప్రవేశాలు పొందే అవ‌కాశం ఉంటుంది. ఇందులో 12 రాష్ట్ర యూనివర్సిటీలు, 11 డీమ్డ్ వర్సిటీలు, 19 ప్రైవేటు యూనివర్సిటీలతో కలిపి మొత్తం 99 యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందొచ్చు. ఇక‌, సీయూఈటీ యూజీ 2024 ప్ర‌వేశ ప‌రీక్ష మొత్తం 13 నిర్వహించారు. ఈ ప‌రీక్ష రాసే అభ్య‌ర్థులు ఏదైనా ఒక లాంగ్వేజ్ పరీక్షను తప్పనిస‌రిగా రాయాల్సి ఉంటుంది.

CUET UG 2024 Results are here Check this

హైబ్రిడ్ విధానంలో ప‌రీక్ష‌..

దేశంలోని 379 నగరాలతో పాటు విదేశాల్లోని 26 కేంద్రాల్లో సీయూఈటీ యూజీ 2024 ప్ర‌వేశ ప‌రీక్ష మే 15వ తేది నుంచి జూన్‌ 29 వ తేది వరకు జ‌రిగింది. ఈ పరీక్షలకు మొత్తం 13.48 లక్షల మంది అభ్య‌ర్థులు హాజరయ్యారు. ఈ ఏడాది నిర్వ‌హించిన ఈ ప‌రీక్ష రెండు (హైబ్రిడ్) విధానాల్లో జ‌రిగింది. అంటే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో ఈ పరీక్షలు జ‌రిగాయి. 15 సబ్జెక్టులకు ఆఫ్‌లైన్ విధానంలో ప‌రీక్ష‌లు జ‌రిగితే, మిగిలిన సబ్జె్క్టులకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించారు. సీయూఈటీ యూజీ 2024 ప్రాథమిక కీ జులై 7న విడుద‌లయిన సంగ‌తి తెలిసిందే. ఈ కీపై జులై 9 వరకు అభ్యంతరాలను స్వీకరించారు. ఈ నెల (జులై) 25వ తేదిన ఫైన‌ల్ ఆన్సర్ కీని విడుద‌ల చేశారు. ఇప్ప‌డు తాజాగా సీయూఈటీ యూజీ 2024 ప్ర‌వేశ ప‌రీక్ష ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+