హైదరాబాద్ బస్తీ దవాఖానాల్లో మెడికల్ ఆఫీసర్ పోస్టులు: అప్లై చేయండి, మంచి జీతం
హైదరాబాద్: జిల్లాలోని హెల్త్ సొసైటీ కింద బస్తీ దవాఖానాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో 31 మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఇందుకోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ కలెక్టర్ అండ్ జిల్లా మేజిస్ట్రేట్, ఛైర్మన్ కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ చేసుకుని ఉండాలి.
వయో పరిమితి:
అభ్యర్థులు 18-44 ఏళ్ల మధ్య ఉండాలి
ఆసక్తి కలిగినవారు ఆఫ్‌లైన్ విధానంలో నవంబర్ 11, 2022 లోపు పోస్టు ద్వారా కింది చిరునామాకు దరఖాస్తులు పంపించవచ్చు.

అకాడమిక్ మెరిట్, రిజర్వేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఎంపికైన వారికి నెలకు రూ. 52,000ల
ఎంపికైన వారికి నెలకు రూ.52,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్:
DM&HO, Hyderabad, 4th floor, GHMC Building, Patny, Secunderabad.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి












Click it and Unblock the Notifications