తెలంగాణ ఇంటర్ పరీక్షలు 5, హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేస్కోండి
తెలంగాణ రాష్ట్రంలో మార్చి 5 నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఇంటర్ బోర్డ్ అధికారులు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. మొదట కాలేజీల లాగిన్‌లలో ఉంచిన అధికారులు.. ఇప్పుడు ప్రథమ, ద్వితీయ ఇంటర్ తోపాటు బ్రిడ్జి కోర్సు పరీక్షల హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పించారు.
విద్యార్థులు తమ రూల్ నెంబర్/ఎస్‌ఎస్‌సీ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంట్ చేసి డౌన్ లోడ్ చేసువచ్చు అని అధికారులు తెలిపారు. కాగా, మార్చి 5 ప్రారంభం కానున్న ప్రథమ ఇంటర్మీడియట్ పరీక్షలు 24వ తేదీతో ముగియనున్నాయి.

ఇక, మార్చి 6 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు 25 వరకు జరగనున్నాయి. ఈ ఏడాది దాదాపు 9లక్షల మందికిపైగా విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాసే అవకాశం ఉంది.
ఇంటర్ ఫస్టియర్ పరీక్షల హాల్ టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇంటర్ సెకండీయర్ పరీక్షల హాల్ టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
బ్రిడ్జి కోర్సు హాల్ టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి












Click it and Unblock the Notifications