డీఆర్డీవో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో అప్రెంటిస్ పోస్టులు, వివరాలు ఇదిగో..
భారత రక్షణకు చెందిన డీఆర్డీవోలో ఖాళీలు భర్తీ చేయనుంది. ఒడిశాలో గల చాందీపూర్ ఇంటిగ్రేటె్ టెస్ట్ రేంజ్ పరిధిలో పిలప్ చేస్తున్నారు. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. ఆ వివరాలు చూడండి.
116 ఖాళీలను భర్తీ చేయబోతుంది. ఇందులో 50 అప్రెంటిస్, డిప్లొమో టెక్నీషియన్ 40, ట్రేడ్ అప్రెంటిస్ 26 ఉన్నారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు సంబంధించి విభాగాలు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ తదితర ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టులో బీబీఏ, బీకాం, బీటెక్ చేసి ఉండాలని కోరింది.

Recommended Video
డిప్లొమో టెక్నీషియన్ అప్రెంటిస్‌కు సంబంధించి.. కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, సివిల్, సినిమాటోగ్రఫీ ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టులో డిప్లొమా చేసి ఉండాలి. ఇక ట్రేడ్ అప్రెంటిస్‌కు సంబంధించి.. కంప్యూటర్ నెట్ వర్కింగ్ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, మెకానిక్ పవర్ ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. అయితే 2019, 2020, 2021లో పూర్తిచేసిన వారు మాత్రమే అర్హులు అనే నిబంధన విధించారు. అర్హత పరీక్షలో సాధించిన మార్కులు/ ఆన్ లైన్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్ లైన్ ద్వారా ఆప్లై చేయాలి. నవంబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications