గుడ్‌న్యూస్: 2440 కొలువలకు ఆర్థికశాఖ ఆమోదం..
తెలంగాణలో కొలువుల జాతర కంటిన్యూ అవుతుంది. వివిధ విభాగాలకు పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆయా ఉద్యోగాలకు ఇప్పటికే ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. దీంతో నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. అయితే మరో 2 వేల పైచిలుకు పోస్టులకు ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆ కొలువులు త్వరలోనే భర్తీ కానున్నాయి.
విద్యా శాఖ, పురావస్తు శాఖల్లోని 2,440 ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ శుక్రవారం అనుమతి మంజూరు చేసింది. ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడంతో త్వరలో ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. విద్యా శాఖ పరిధిలో 1,392 జూనియర్ లెక్చరర్లు, ఇంటర్మీడియట్ విద్యా విభాగంలో 40 లైబ్రేరియన్లు, 91 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, పాలిటెక్నిక్ కళాశాలల్లో 247 లెక్చరర్లు, 14 ఇన్‌స్ట్రక్టర్, 31 లైబ్రేరియన్, 5 మ్యాట్రన్, 25 ఎలక్ట్రీషియన్, 37 ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి అనుమతి లభించింది.

ఇక పురావస్తు శాఖలో 14 ఖాళీలు, కళాశాల విద్యా విభాగంలో 491 లెక్చరర్లు, 24 లైబ్రేరియన్. 29 ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి అనుమతి లభించింది. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ, అనుబంధ రంగాలకు ప్రాధాన్యం ఇస్తోంది. ఆ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపడుతుంది. ఇప్పుడు విద్యాశాఖ పరిధిలో కూడా కొలువుల భర్తీ కానున్నాయి. టీచర్ కొలువులను ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications