Chandrayaan-3:ఇస్రోలో స్పేస్ సైంటిస్ట్ అవ్వడం ఎలా..కంప్లీట్ గైడ్..!
బుధవారం రోజున భారత్ చరిత్ర సృష్టించింది. చంద్రయాన్-3ని చంద్రుడిపైకి విజయవంతంగా పంపి ఆ ఘనత సాధించిన నాల్గవ దేశంగా భారత్ నిలిచింది. ఇక చంద్రుడి దక్షిణ ధృవంకు చేరిన తొలి దేశంగా భారత్ మరో రికార్డు సృష్టించింది. ఇక చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించిన పిల్లలు, యువత స్ఫూర్తిని పొందారు. తాము కూడా ఇలాంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నారు. అయితే ఇస్రోలో స్పేస్ సైంటింస్ట్ కావాలంటే అనుసరించాల్సిన మార్గమేంటి..?
చంద్రయాన్-3 మిషన్ సక్సెస్ కావడంతో ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. అతి తక్కువ ఖర్చుతో ఇలాంటి ఒక భారీ ప్రాజెక్టును సక్సెస్ చేయడంలో కీలక పాత్ర వహించిన ఇస్రో అందులో పనిచేసే సెంటిస్టులపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. ఈ హిస్టారికల్ ఈవెంట్‌ను చూసిన చిన్నారులు యువత తాము కూడా ఇస్రోలో స్పేస్ సైంటిస్టులు కావాలనే కోరికను బలంగా తల్లిదండ్రుల వద్ద వినిపిస్తున్నారు. చాలా స్కూళ్లు, కాలేజీలు విద్యార్థులకు లైవ్‌లో ఈ ఘట్టాన్ని ప్రదర్శించాయి. దీంతో విద్యార్థుల్లో ఒక ప్రేరణ కలిగి తాము కూడా స్పేస్ సైంటిస్ట్ అవ్వాలనే ఆలోచన ప్రారంభమైంది.

అయితే ఇస్రోలోనే కాదు మరే అంతరిక్ష పరిశోధనా సంస్థలో అయినా సరే స్పేస్ సైంటిస్ట్ కావాలంటే ఇలా చేయాలి.10వ తరగతి అయ్యాక ఇంటర్మీడియెట్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ కెమిస్ట్రీ (MPC) తీసుకోవాలి.ఈ సబ్జెక్టులు తీసుకోవడం వల్ల విద్యార్థులు ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లోకి అడుగుపెట్టే అవకాశాలు మెండుగా ఉంటాయి. లేదా బీఎస్సీ కోర్సులు చేయడానికి వీలుంటుంది.
ముందుగా బీటెక్ కోర్సులు చదివేందుకు ఆయా యూనివర్శిటీలు నిర్వహించే ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ అటెండ్ కావాల్సి ఉంటుంది.అంతేకాదు జేఈఈ మెయిన్ లేదా జేఈఈ అడ్వాన్స్‌డ్ లాంటి ఆలిండియా పరీక్షలు రాయాలి.జేఈఈ మెయిన్ పరీక్షలు రాసి క్వాలిఫై అయితే నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT), ఇండియన్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT)లాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలతో పాటు మరికొన్ని పాపులర్ కాలేజీల్లో సీటు పొందే అవకాశం ఉంటుంది. ఇక జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షల్లో క్వాలిఫై అయితే ఐఐటీలో సీటు దక్కే ఛాన్స్ ఉంటుంది. ఇక బీఎస్సీ కోర్సులు చదవాలంటే కామన్ యూనివర్శిటీ ఎంట్రెన్స్ టెస్టు (CUTET) రాయాల్సి ఉంటుంది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్శిటీలలో సీటు పొందే అవకాశం ఉంటుంది.
ఇండియన్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా విద్యార్థులు బీటెక్ చేయొచ్చు. ఇందులో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ ఇంకా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (Avionics) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు ఐదేళ్ల పాటు డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాం ఈ ప్రతిష్టాత్మక విద్యాసంస్థలో ఉంది.
ఇస్రో (ISRO) రిక్రూట్‌మెంట్:
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) కొన్ని సార్లు నేరుగా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ నిర్వహిస్తుంది.మరికొన్ని సార్లు కామన్ ఎగ్జామ్ నిర్వహించి స్పేస్ సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేస్తుంది.ఇందుకోసం ఆసక్తిగల అభ్యర్థులు రెగ్యులర్‌గా ఇస్రో వెబ్‌సైట్‌ను సందర్శిస్తూ ఉండాలి. దీంతో అక్కడ ఖాళీగా ఉండి భర్తీ చేయాల్సిన పోస్టుల వివరాలు తెలుస్తాయి.












Click it and Unblock the Notifications