ఐబీపీఎస్, ఐవోసీఎల్ రిక్రూట్‌మెంట్స్: 50వేల నుంచి లక్షపైనే జీతాలు, వెంటనే అప్లై చేయండి
న్యూఢిల్లీ: పలు ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశాయి. పదవ తరగతి, ఇ:టర్మీడియంట్ అర్హతతో కూడా దరకాస్తు చేసుకునే ఉద్యోగాలు కూడా ఇందులో ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు సంబంధిత వెబ్‌సైట్లకు వెళ్లి చివరి తేదీలోపు ధరకాస్తు చేసుకోవచ్చు. కొన్ని ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ల గురించిన వివరాలను మీకోసం అందివ్వడం జరిగింది.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషణ్ లిమిటెడ్(ఐవోసీఎల్)
జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్, జూనియర్ మెటీరియల్ అసిస్టెంట్, జూనియర్ నర్సింగ్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐవోసీఎల్) ఉద్యోగ నోటిఫికేషన్ విడుల చేసింది. ఇవన్నీ కలిపి మొత్తం 533 పోస్టులు ఖాళీలను భర్తీ చేయనుంది. అక్టోబర్ 12న దరఖాస్తులకు చివరి తేదీ కావడం గమనార్హం.

భర్తీ చేయనున్న మొత్తం 533 పోస్టుల్లో...
జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్- IV (ప్రొడక్షన్)-296
జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్- IV (P&U)-35
జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్- IV (ఎలక్ట్రికల్)/ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్- IV-65
జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్- IV (మెకానికల్)/ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్- IV- 27
జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్- IV (ఇన్స్ట్రుమెంటేషన్)/జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్- IV-64
జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్- IV-29
జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్- IV (ఫైర్ & సేఫ్టీ)-14
జూనియర్ మెటీరియల్ అసిస్టెంట్-IV / జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్- IV-4
జూనియర్ నర్సింగ్ అసిస్టెంట్- IV-1
వయో పరిమితి: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి 18 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఇవ్వబడుతుంది.
విద్యార్హత: దరఖాస్తుదారుడు భారతీయ జాతీయుడు అయి ఉండాలి. వివిధ పోస్టుల కోసం, విద్య అవసరం మారుతుంది. కొన్ని పోస్టులకు, దరఖాస్తుదారులు డిప్లొమా కలిగి ఉండాలి, మరికొందరికి మాధ్యమిక విద్య తప్పనిసరి. అయితే చాలా పోస్టులకు గ్రాడ్యుయేట్ స్థాయి డిగ్రీ అవసరం.
అభ్యర్థులను ఎంపిక చేయడానికి ఐవోసీఎల్ రాత పరీక్ష నిర్వహిస్తుంది. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థి తదుపరి ప్రక్రియకు అర్హత సాధించడానికి నైపుణ్య పరీక్షకు హాజరు కావాలి.
ఎంపికైన అభ్యర్థి అర్హతను బట్టి ఈ పోస్టులకు జీతాలు రూ. 25000 - రూ .1,05,000 మధ్య ఉంటాయి.
ఐబీపీఎస్ రిక్రూట్‌మెంట్ 2021
అసిస్టెంట్ ప్రొఫెసర్, ఫ్యాకల్టీ రీసెర్చ్ అసోసియేట్, రీసెర్చ్ అసోసియేట్, హిందీ ఆఫీసర్, ఐటీ ఇంజినీర్(డేటా సెంటర్), ఐటీ డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్, సాఫ్ట్‌వేర్ డెవలపర్ తదితర పోస్టుల భర్తీకి ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్ ibps.inలో అప్లికేషన్ ఫాంలు అందుబాటులో ఉన్నాయి. అక్టోబర్ 14లోగా ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
రాత పరీక్ష రాసిన అనంతరం అర్హత సాధించిన వారిని ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరుగుతుంది. అన్ని పోస్టులకు అప్లికేషన్ పీజు రూ. 1000. కాగా, విజయవంతమైన అభ్యర్థులు ఇప్పటికే ఉన్న ఖాళీలపై నియమించబడతారు, కానీ వేచి ఉండే జాబితా కూడా విడుదల చేయబడుతుంది, ఇది మార్చి 31, 2022 వరకు చెల్లుతుంది.
Recommended Video
జీతాల వివరాలు: అసిస్టెంట్ ప్రొఫెసర్ వేతనం రూ .1,66,541, ఫ్యాకల్టీ రీసెర్చ్ అసోసియేట్‌కు రూ .98,651, రీసెర్చ్ అసోసియేట్‌కి రూ .74,203, హిందీ ఆఫీసర్‌కు రూ .74,203. IT ఇంజనీర్ (డేటా సెంటర్) కి రూ .59,478, IT డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్‌కు రూ .59,478, మరియు సాఫ్ట్‌వేర్ డెవలపర్, టెస్టర్ (ఫ్రంటెండ్, బ్యాకెండ్) రూ .59,478 చెల్లించబడుతుంది.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications