రైల్వేతోపాటు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు: రూ. లక్ష వరకు జీతాలు, వెంటనే అప్లై చేయండి
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది శుభవార్తే. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశాయి. ఈ వారంలోనే కొన్నింటి దరఖాస్తు గడువు ముగిసిపోనుంది. ఈ క్రమంలో ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.

నేషనల్ హౌసింగ్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2021
నేషనల్ హౌసింగ్ బ్యాంక్(ఎన్‌హెచ్‌బీ) పలు సీనియర్ మేనేజ్ మెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ సహా పలు పోస్టులను భర్తీ చేయనుంది. డిసెంబర్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2022 జనవరి లేదా ఫిబ్రవరిలో పరీక్షనిర్వహించడం జరుగుతుంది. ఆన్‌లైన్ పరీక్ష ద్వారా అభ్యర్థులు ఎంపిక జరుగుతుంది. ఈ పోస్టుల పే స్కేల్ రూ. 60,056.72 నుంచి రూ. 1,26,954 వరకు ఉంటుంది. సంస్థ అధికారిక వెబ్ సైట్ www.nhb.org.in సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఐఏఎఫ్ ఏఎఫ్‌సీఏటీ రిక్రూట్‌మెంట్ 2023
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (AFCAT) కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. కోర్సులు జనవరి 2023 నుంచి ప్రారంభమవుతాయి. దరఖాస్తు ఫారమ్‌లు afcat.cdac.in అధికారిక వెబ్‌సైట్‌లో డిసెంబర్ 30 వరకు అందుబాటులో ఉంటాయి. రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా 317 ఖాళీలను భర్తీ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు రూ. 56,100 నుంచి రూ. 1,77,500 వరకు జీతం పొందుతారు.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్ మెంట్ 2021
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎకనామిస్ట్, డేటా సైంటిస్ట్, ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్, లా ఆఫీసర్, రిస్క్ మేనేజర్, టెక్నికల్ ఆఫీసర్, సెక్యూరిటీ, ఇతర ప్రొఫైల్‌ల కోసం 115 సీట్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. డిసెంబర్ 17 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ఆన్ లైన్ పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక జరుగుతుంది. సంస్థ అధికారిక వెబ్ సైట్ సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవడంతోపాటు దరఖాస్తు చేయవచ్చు.

ఇండియన్ రైల్వే అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2021
సౌత్ ఈస్టర్న్ రైల్వే(ఎస్ఈఆర్) 1785 అప్రెంటీస్‌లను నియామకం చేపడుతోంది.
అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి, ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. దరఖాస్తులను అధికారిక వెబ్‌సైట్ scr.indianrailways.gov.in ద్వారా డిసెంబర్ 14 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు.












Click it and Unblock the Notifications