Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

GATE 2025 : గేట్ అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. టెస్ట్‌ పేపర్ల వారీగా ప‌రీక్ష షెడ్యూల్ విడుద‌ల‌.

గేట్ 2025 అప్ల‌య్ చేసుకున్న అభ్య‌ర్థుల‌కు ముఖ్య గ‌మ‌నిక‌.. గేట్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల‌య్యింది. తాజాగా ఐఐటీ రూర్కీ టెస్ట్‌ పేపర్ల వారీగా గేట్‌ పరీక్ష షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది. ఈ ప‌రీక్ష‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థులు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి ప‌రీక్ష షెడ్యూల్ వివ‌రాల‌ను ప‌రిశీలించ‌గ‌ల‌రు. గేట్ 2025 ప‌రీక్ష‌లు ఫిబ్ర‌వ‌రి 1, 2, 15, 16 తేదీల్లో జ‌రగ‌నున్నాయి. రోజుకు రెండు సెష‌న్ల‌లో ఈ ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి. మొద‌టి సెష‌న్ ఉదయం 9.30 నుంచి 12.30 వరకు ఉండ‌గా, రెండో సెష‌న్ మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు ఉంటుంది.

గేట్‌ 2025 దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్‌ 11వ తేదీన ముగిసిన సంగ‌తి తెలిసిందే. గేట్ ప‌రీక్ష‌లో సాధించిన స్కోర్‌ ఆధారంగా జాతీయ స్థాయిలోని విద్యాసంస్థలే కాకుండా పలు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలు ఇస్తాయి. ఇక‌, ఈసారి గేట్ 2025 పరీక్షల నిర్వహణ బాధ్యతలను రూర్కీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తీసుకుంది. గేట్ ప‌రీక్ష‌లు మొత్తం 30 సబ్జెక్టుల‌లో నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా సుమారు 200 నగరాలు, పట్టణాల్లో గేట్-2025 పరీక్షలు జ‌ర‌గ‌నున్నాయి.

GATE 2025 Alert for GATE Candidates Test Paper wise Exam Schedule Released

ప‌రీక్షా విధాన‌మిదే..

గేట్ ప‌రీక్షా స‌మ‌యం మూడు గంటలు ఉంటుంది. ఈ ప‌రీక్ష‌లను సిబిటి విధానంలో నిర్వ‌హిస్తారు. ఈ పరీక్షలో 65 ప్ర‌శ్న‌లు ఉంటాయి. వాటికి 100 మార్కులు. ఇందులో జనరల్ ఆప్టిట్యూడ్ నుంచి 10 ప్రశ్నలు అడుగుతారు. వీటికి 15 మార్కులు ఉంటాయి. టెక్నికల్, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ విభాగాల నుంచి 55 ప్రశ్నలు అడుగుతారు. వీటికి 85 మార్కులు ఉంటాయి. నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. ఒక మార్కు ప్రశ్నలకు ప్రతి తప్పు సమాధానానాకి 1/3 చొప్పున.. 2 మార్కుల ప్రశ్నలకు ప్రతి తప్పు సమాధానానాకి 2/3 చొప్పున కోత విధిస్తారు. అభ్య‌ర్థులు ఈ విష‌యాన్ని గ‌మ‌నంలో ఉంచుకోవాల్సి ఉంటుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+