పదో తరగతి పాసయిన వారికి గుడ్‌న్యూస్..75,768 జీడీ కానిస్టేబుల్ పోస్టులు...
స్టాఫ్ సెలక్షన్ కమీషన్ భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పదో తరగతి పూర్తిచేసిన వారికి ఎస్ఎస్‌సి ఓ అద్భుతమైన అవకాశాన్ని తీసుకొచ్చింది. పది పాసయ్యి కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శుభవార్త.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సి) 75,768 పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్‌ను ప్రకటించింది.
కేంద్రప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడాలనుకునేవారికి ఇదొక సువర్ణవకాశం. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఎస్ఎస్బీ, ఐటీబీపీ, ఏఆర్, ఎస్ఎస్ఎఫ్, ఎన్ఐఏ వంటి పోలీస్ ఫోర్స్ల్లోని పోస్టులను భర్తీ చేస్తారు. వీటికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హతలు, ఫీజు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకుందాం..

పురుషుల పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి...
బీఎస్ఎఫ్ - 24,806 పోస్టులు
సీఐఎస్ఎఫ్ - 7877 పోస్టులు
సీఆర్పీఎఫ్ - 22,196 పోస్టులు
ఎస్ఎస్బీ - 4839 పోస్టులు
ఐటీబీపీ - 2564 పోస్టులు
ఏఆర్ - 4624 పోస్టులు
ఎస్ఎస్ఎఫ్ - 458 పోస్టులు
మొత్తం పోస్టులు - 67,364
మహిళల పోస్టుల వివరాలు...
బీఎస్ఎఫ్ - 3,069 పోస్టులు
సీఐఎస్ఎఫ్ - 721 పోస్టులు
సీఆర్పీఎఫ్ - 3231 పోస్టులు
ఎస్ఎస్బీ - 439 పోస్టులు
ఐటీబీపీ - 442 పోస్టులు
ఏఆర్ - 152 పోస్టులు
ఎస్ఎస్ఎఫ్ - 125 పోస్టులు
మొత్తం పోస్టులు - 2626
ఎన్ఐఏ - 225 పోస్టులు
విద్యార్హతలు : అభ్యర్థులు మెట్రిక్యులేషన్ (10వ తరగతి) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవాలనుకునే అభ్యర్థుల వయస్సు 2023 జనవరి 1 నాటికి 23 ఏళ్ల లోపు ఉండాలి. ఈ పోస్టులకు ఫీజు అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్మెన్, మహిళలకు ఎలాంటి దరఖాస్తు ఫీజు ఉండదు.
ఎంపిక చేసుకునే ప్రక్రియ ఈ విధంగా ఉంటుంది...
అభ్యర్థులు ముందుగా కంప్యూటర్ బైస్డ్ టెస్ట్ (CBT) ను రాయాల్సి ఉంటుంది. ఇందులో జనరల్ అవేర్నెస్, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్/ హిందీ సబ్జెక్ట్స్కు సంబంధించిన ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలను అడుగుతారు. పరీక్ష సమయం గంట మాత్రమే ఉంటుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ (PET)/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST)ను నిర్వహించడం జరుగుతుంది. ఇందులో అభ్యర్థులు అర్హత సాధించాల్సి ఉంటుంది. పీఈటీ, పీఎస్టీల్లో అర్హత సాధించిన వారికి మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆయా ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది.
PET, PST టెస్ట్లు...
మేల్ అభ్యర్థులు కేవలం 24 నిమిషాల్లో 5 కిలోమీటర్ల దూరం పరుగెత్తాల్సి ఉంటుంది. ఫీమేల్ అభ్యర్థులు కేవలం 8 1/2 నిమిషాల్లో 1.6 కిలోమీటర్లు పరుగెత్తాల్సి ఉంటుంది. పురుషులు 170 సెంటిమీటర్ల ఎత్తు కలిగి ఉండాలి. మహిళలు 157 సెంటిమీటర్ల ఎత్తును కలిగి ఉండాలి. పురుషులకు మాత్రమే ఛాతీ కొలతలను తీసుకుంటారు. సాధారణంగా అయితే పురుషుల ఛాతీ కొలత 80 సెంటిమీటర్ల వరకు ఉండాలి. ఊపిరి తీసుకున్నప్పుడు కనీసం 5 సెంటిమీటర్లు ఛాతీ విస్తరించాలి.
శాలరీ...
ఎన్ఐఏలో సిపాయిగా చేరేవారికి నెలకు రూ.18,000 నుంచి రూ.56,900 వరకు ఉంటుంది.
మిగతా పోస్టులన్నింటికీ నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతం ఉంటుంది.
అప్లయ్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్సైట్ https://ssc.nic.in/ లో దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీల వివరాలు...
దరఖాస్తు ప్రారంభ తేదీ : 2023 నవంబర్ 24
దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ : 2023 డిసెంబర్ 28
ఆన్‌లైన్ ఫీజు/ చలాన్ చెల్లింపునకు ఆఖరు తేదీ : 2023 డిసెంబర్ 29
ఆన్‌లైన్ టెస్ట్ : 2024 ఫిబ్రవరి 20, 21 ,22, 23, 24, 26, 27, 28, 29
2024 మార్చి 1, 5, 6, 7, 11, 12 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications