తెలంగాణ నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌.. విద్యుత్ శాఖ‌లో 3,500 ఉద్యోగాలు..

తెలంగాణలోని నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. రాష్ట్రంలో ఉద్యోగ నియామక ప్రక్రియ సాగుతోంది. ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం నియామకాలు పూర్తి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నేప‌థ్యంలో మ‌రో నోటిఫికేష‌న్ విడుద‌ల చేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్తు పంపిణీ సంస్థల్లో జూనియర్‌ లైన్‌మెన్‌ ఖాళీల పోస్టుల భర్తీకి ప్ర‌భుత్వం రంగం సిద్ధంచేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా మొత్తం 3,500 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేయనున్న‌ట్లు స‌మాచారం.

హైదరాబాద్‌ నగరం కేంద్రంగా ఉన్నవిద్యుత్తు పంపిణీ సంస్థతో పాటు, వరంగల్‌ కేంద్రంగా ఉన్న విద్యుత్తు పంపిణీ సంస్థల‌ను కలిపి మొత్తం 3,500 వరకు జూనియర్‌ లైన్‌మెన్‌, ఇతర పోస్టులు ఖాళీగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈ పోస్టుల భర్తీకి ఈ నెల (న‌వంబ‌ర్‌)లోనే ఉద్యోగ ప్రకటన జారీ చేసేలా రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు స‌మాచారం. ఇక‌, ఈ పోస్టుల్లో భాగంగా టీజీఎస్‌పీడీసీఎల్‌లో మొత్తం 1,550 వరకు జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులు ఉన్నాయి. నగర పరిధిలో చూసుకుంటే 550 పోస్టులు ఖాళీగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Good news for the unemployed in Telangana 3500 jobs in the electricity department

మ‌హిళ‌లు కూడా అర్హులే..

గతంలో హైదరాబాద్ ప‌రిధిలోని విద్యుత్ శాఖ‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్ వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే, నియామక నోటిఫికేషన్‌ మేరకు అర్హులైన అభ్యర్థులు లేకపోవడంతో 200 వరకు పోస్టులు మిగిలిపోయాయి. తాజాగా వీటన్నింటిని కలిపి మరో కొత్త నోటిఫికేషన్ విడుద‌ల చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇక‌, ఈ సారి విడుద‌ల చేసే జూనియ‌ర్ లైన్‌మెన్ పోస్టుల‌కు మహిళలు కూడా అర్హులే అని తెలుస్తోంది.

జేఎల్‌ఎంతో పాటు 50 వరకు అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టులకు టీజీఎస్‌పీడీసీఎల్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసే ఆలోచ‌న‌లో ఉన్నట్లు స‌మాచారం. నవంబర్‌లోనే జూనియర్ లైన్‌మెన్‌, ఏఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేందుకు డిస్కంలు రంగం సిద్ధం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి మేరకే ముందుకు వెళ్లనునున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, ఎస్సీ వర్గీకరణ గురించి తేలిన తర్వాతే తదుపరి ఉద్యోగ నోటిఫికేషన్లు విడుద‌ల చేస్తామ‌ని, ఇటివలే ఉపసంఘం వెల్లడించిన సంగ‌తి తెలిసిందే. త్వరలో ఈ నోటిఫికేష‌న్‌పై పూర్తిస్థాయి స్పష్టత వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+