Jobs:నిరుద్యోగుల‌కు శుభవార్త‌... ఈ పండుగ సీజ‌న్‌లో 5 ల‌క్ష‌ల ఉద్యోగాలు..

పండుగ సీజన్ రాబోతుంది. సాధార‌ణంగా పండుగ సీజ‌న్‌లో క‌స్ట‌మ‌ర్స్‌ను మెప్పించేందుకు భారీ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టిస్తుంటాయి కొన్ని సంస్థ‌లు. ఇక‌, ఆన్‌లైన్ షాపింగ్స్ ఫిప్ల‌కార్ట్‌, మీషో, అమెజాన్ వంటివైతే పండ‌గ‌ల‌ప్పుడు ఏకంగా ధ‌మాకా ఆఫ‌ర్స్‌ల‌ను క‌స్ట‌మ‌ర్స్ కోసం తీసుకొస్తాయి. కానీ, ఈ సారి ఓ ఈ కామ‌ర్స్ సంస్థ ఏకంగా నిరుద్యోగుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. అదేంటి పండ‌గ సీజ‌న్‌లో షాపింగ్ ఆఫర్స్ ఉంటాయి. కానీ, నిరుద్యోగుల‌కు బంఫ‌ర్ ఆఫ‌ర్ ఏంటి అని అనుకుంటున్నారా? ఇంత‌కీ ఆ ఆఫ‌ర్‌ ఏంటో చూద్దాం రండి.

జాబ్‌ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల‌కు 5 లక్షల సీజనల్ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని మీషో ప్రకటించింది. ఈ పండుగ సీజ‌న్‌లో పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు తమ వెండర్, లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌లో సుమారు 5 లక్షల సీజనల్ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని ప్రకటించింది మీషో.. గతేడాది మీషో సృష్టించిన సీజనల్ ఉద్యోగాలతో పోలిస్తే ఈ సారి 50 శాతం పెంచినట్లు తెలుస్తోంది.

Good news for the unemployed,Meesho announces 5 lakh jobs this festive season

వివిధ విభాగాల్లో బాధ్య‌త‌లు..:ఇందులో భాగంగానే, డెలివరీ పికింగ్, సార్టింగ్, లోడ్ చేయడం, అన్‌లోడ్ చేయడం ,రిటర్న్ ఇన్‌స్పెక్షన్ వంటి పనులకు బాధ్యత వహించే ఫస్ట్-మైల్ , డెలివరీ అసోసియేట్‌ ఉద్యోగాలున్నాయి. ఈ పండుగ సీజన్‌లో క‌స్ట‌మ‌ర్ల డిమాండ్ గణనీయంగా పెరుగుతుందని తాము ఆశిస్తున్నామని ఫుల్‌ఫిల్‌మెంట్ , ఎక్స్‌పీరియన్స్ చీఫ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫీసర్ సౌరభ్ పాండే తెలిపారు. ఈ స‌మ‌యంలో కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడం , లెక్కలేనన్ని చిన్న వ్యాపారాలకు సాధికారత కల్పించడంపై దృష్టి కేంద్రీకరిస్తున్న‌ట్లు తెలిపారు. అదనంగా, మీషో విక్రేతలు పండుగ సీజన్ కోసం వారి అవసరాలలో భాగంగా 3 లక్షల కంటే ఎక్కువమంది ఉద్యోగులను నియమించుకుంటారని పేర్కొన్నారు.

ఇందులోనే ఎక్కువ అవ‌కాశాలు..:దీనికోసం థ‌ర్డ్ పార్టీ లాజిస్టిక్స్ ప్లేయ‌ర్ల‌తో భాగ‌స్వాములైన Ecom Express, DTDC, Elastic Run, LoadShare, Delhivery, ShadowFax , ExpressBiz వంటి వాటితో సుమారు రెండు ల‌క్ష‌ల ఉద్యోగాల‌ను ప్రారంభించే ప‌నిని ల‌క్ష్యంగా పెట్టుకుంది మీషో. ఇందులో టైర్-III , టైర్-IV రంగాల నుండే ఎక్కువ అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ మ‌ధ్య‌కాలంలో బెంగుళూరు, ఢిల్లీ, ముంబై , హైదరాబాద్ వంటి టైర్-1 నగరాలతో పోలిస్తే టైర్-II , టైర్-III నగరాల్లో చివరి-మైల్ డెలివరీ సిబ్బంది , కాల్ సెంటర్ ఆపరేటర్లకు డిమాండ్ ఎక్కువైన‌ట్లు క‌నిపిస్తోంది. ఇప్పుడు నియ‌మించే ఉద్యోగులు క‌స్ట‌మ‌ర్ డిమాండ్ల‌ను తీర్చేందుకు ప్యాకేజింగ్ , సార్టింగ్‌తో సహా వివిధ సామర్థ్యాలలో మీషో, కొనుగోలుదారుల‌కు సహాయం చేస్తారు. ఎన‌భై శాతం కంటే ఎక్కువ‌మందికి కొత్త ప్రాడ‌క్ట్స్ ప‌రిచ‌యం చేసేలా, ఫ్యాష‌న్ యాక్స‌స‌రీస్‌, ఫెస్టివ డెక‌రేట్ వంటి కొత్త కేట‌గిరిల్లో వెంచ‌ర్ చేయాల‌ని మీషో భావిస్తోంది.

పండుగ సీజన్‌కు ముందు, వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఇటీవల 1,00,000 కొత్త ఉద్యోగ అవకాశాలను ఇస్తున్న‌ట్లు ఇటీవ‌లే పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్ తన వార్షిక ఫ్లాగ్‌షిప్ ఈవెంట్, బిగ్ బిలియన్ డేస్ (TBBD) , 10వ ఎడిషన్‌ను అక్టోబ‌ర్‌ నెల ప్రారంభంలో జ‌రుపుకునే ఆలోచ‌లో ఉంది. ఈ సంద‌ర్భంగా కస్టమర్ల కోరిక‌లు తీర్చేందుకు ఉద్యోగుల‌ను నియ‌మించుకునే ప‌నిలో ఉంది ఫిఫ్ట్‌కార్ట్‌.

Good news for the unemployed,Meesho announces 5 lakh jobs this festive season

ఇత‌ర ఈ కామ‌ర్స్ కంపెనీలు..:ఇదిలా ఉంటే అనేక ఇత‌ర ఈ-కామర్స్ కంపెనీలు వ‌చ్చే పండుగ సీజన్‌లో అధిక డిమాండ్‌ను ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నాయి. ఈ డిమాండ్ కార‌ణంగా ఇత‌ర ఈ కామ‌ర్స్ కంపెనీలు కొన్ని అధిక మొత్తంలో ఉద్యోగుల‌ను నియ‌మించుకోవాల‌ను కుంటున్నారు. ఈ సంద‌ర్భంగానే భారతదేశంలోని గిగ్ వర్కర్లకు 500,000 కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని స్టాఫింగ్ సొల్యూషన్స్ కంపెనీ టీమ్‌లీజ్ తెలిపింది. దేశంలో గిగ్ వర్కర్ల కోసం దాదాపు 200,000 ఖాళీలు ఉన్న‌ట్లు ఈ సంద‌ర్భంగా పేర్కొంది. ఇందులో ముఖ్యంగా చివరి-మైల్ డెలివరీ స్థానాలు , వేర్‌హౌస్ కార్యకలాపాలలో డిసెంబర్ నాటికి ఈ ఖాళీల సంఖ్య 700,000కి చేరుకునే అవ‌కాశం ఉందంటున్నారు. గతేడాది కంటే ఈ సారి పండుగ నియామకాలు గిగ్ జాబ్‌లలో 25 శాతం పెరుగుతాయ‌ని టీమ్‌లీజ్ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+