నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. ఎస్‌బిఐలో 1,040 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకు ఉద్యోగిగా స్థిర‌ప‌డాల‌నుకునేవారికి శుభ‌వార్త‌.. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా భారీ ఉద్యోగాల‌కు నోటిఫికేషన్ ప్ర‌క‌టించింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 1040 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. అర్హత‌, ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు చేసుకోగ‌ల‌రు. స్పెష‌లిస్టు కేడ‌ర్ ఆఫీస‌ర్ నియామ‌కాల భర్తీకి ఎస్‌బిఐ ప్రకటనను విడుదల చేసింది.

ఈ ఉద్యోగాల‌కు ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ శాఖల్లో ప‌ని చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్ప‌టికే ప్రారంభమైంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో ఆగస్టు 8వ తేదీ వరకు ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు. అభ్య‌ర్థులు పూర్తి వివరాల కోసం ఎస్‌బిఐ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్ర‌దించ‌గ‌ల‌రు.

Good news for the unemployed Notification for 1040 jobs in SBI

ఇత‌ర అర్హ‌త‌లు..

ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేయాల‌నుకునే అభ్య‌ర్థులు పోస్టును అనుసరించి సీఏ/ సీఎఫ్‌ఏ, ఏదైనా డిగ్రీ, పీజీ డిప్లొమా/ సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఎక్స్‌పీరియ‌న్స్ క‌లిగి ఉన్న‌వారు అర్హులు. ఈ పోస్టుల‌కు అప్ల‌య్ చేసుకోవాల‌నుకునే జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థులు రూ. 750 ద‌ర‌ఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు వ‌ర్తిస్తుంది.

ఈ ఉద్యోగాల‌కు షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ, గ్రూప్‌ డిస్కషన్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ జులై 19, 2024 నుంచి ప్రారంభ‌మైంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది ఆగస్టు 8, 2024 గా నిర్ణ‌యించడ‌మైన‌ది. ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ను అభ్య‌ర్థులు ఈ లింక్‌పై https://recruitment.bank.sbi/crpd-sco-2024-25-09/apply క్లిక్ చేయ‌గ‌ల‌రు.

మొత్తం పోస్టులివే : 1,040

సెంట్రల్ రిసెర్చ్ టీమ్ (ప్రొడక్ట్ లీడ్): 02
సెంట్రల్ రిసెర్చ్ టీమ్ (సపోర్ట్‌): 02
ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ మేనేజర్ (టెక్నాలజీ): 01
ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ మేనేజర్ (బిజినెస్): 02
రిలేషన్‌షిప్ మేనేజర్: 273
వీపీ వెల్త్‌+: 643
రిలేషన్‌షిప్ మేనేజర్- టీమ్ లీడ్: 32
రీజినల్ హెడ్: 06
ఇన్వెస్ట్‌మెంట్ స్పెషలిస్ట్: 30
ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్: 49

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+