నిరుద్యోగులకు గుడ్‌న్యూస్...ఏపీపీఎస్సీ మరో 6 నోటిఫికేషన్లు...
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు రాష్ట్రప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. తాజాగా ఏపీపీఎస్సీ ద్వారా వివిధ కేటగీరీల్లో ఖాళీగా ఉన్న 33పోస్టులకు 6 వేరువేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఇప్పటికే గ్రూప్1, గ్రూప్ 2తోపాటు టెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసిన జగన్ సర్కార్ తాజాగా నిరుద్యోగులకు మరో అవకాశం కల్పించడంతో వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేల రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలపై దృష్టి పెట్టిందని, ఈ అవకాశాలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన ఉద్యోగాలను ప్రకటించిన విషయం తెలిసిందే.
ఫిబ్రవరి 9వ తేదీన ఏపీపీఎస్సీ ద్వారా విడుదల చేసిన ఆరు నోటిఫికేషన్లలో భర్తీ చేయనున్న ఉద్యోగాలు పరీశీలిస్తే కాలుష్య నియంత్రణ మండలిలో అనలిస్ట్ గ్రేడ్-2 కింద -18, టౌన్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ -07, మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీస్‌లో లైబ్రేరియన్ -04, ట్రైబల్ వెల్ఫేర్ సర్వీస్‌లో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ -01, వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఎబుల్డ్ ట్రాన్స్‌జెండర్, సీనియర్ సిటిజన్ సర్వీస్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ -02, భూగర్భ నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ కెమిస్ట్ -01 చొప్పున మొత్తం 33 పోస్టులు ఉన్నాయి. ఇలా, కొత్తగా ఏర్పడిన రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో ఉద్యోగాల సంఖ్యను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది.

డివిజన్‌ల బలోపేతం దిశగా : ఒక్కో కార్యాలయంలో క్యాడర్ బలోపేతం చేసేలా 19 పోస్టులు కేటాయిస్తూ శుక్రవారం (ఫిబ్రవరి 9) ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా ఈ డివిజన్‌లను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విభాగాల వారీగా ఈ నియామాకాలకు మార్చి 19వ తేదీ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. ఈ పోస్టులకు అవసరమైన విద్యార్హతలతోపాటు వయసు సడలింపులకు సంబందించిన పూర్తి వివరాలను కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
వెబ్‌సైట్ చిరునామా... https://portal-psc.ap.gov.in/












Click it and Unblock the Notifications