నిరుద్యోగులకు శుభవార్త..ఎస్ఎస్‌సి సీజిఎల్ 2024 భారీ నోటిఫికేషన్..
నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ శుభవార్త అందించింది. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (సీజీఎల్) పరీక్ష-2024కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఎస్‌ఎస్‌సీ వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఉన్న సుమారు1 7 వేలకు పైగా గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ పోస్టుల కసం అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. డిగ్రి అర్హత కలిగిన అభ్యర్థులెవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు టైర్-1, టైర్-2 తదితర పరీక్షల ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు జనరల్ అభ్యర్థులు రూ. 100 చెల్లంచాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ మహిళలు/ దివ్యాంగులు/ ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ 24.06.2024 నుంచి ప్రారంభమయ్యింది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు 24.07.2024 చివరితేదిగా నిర్ణయించారు. ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సెప్టెంబర్/ అక్టోబర్‌లో రాత పరీక్షలను నిర్వహిస్తారు. ఈ పరీక్షలు కూడా ఆన్‌లైన్ విధానంలోనే ఉంటాయి. అభ్యర్థులు పూర్తి వివరాలకోసం లేదా దరఖాస్తు చేసుకునేందుకు ఎస్ఎస్‌సి అధికారిక వెబ్‌సైట్ https://ssc.nic.in/ ను సంప్రదించగలరు.
మొత్తం పోస్టులు 17,727
విభాగాలు: గ్రూప్-బి, గ్రూప్-సి
పోస్టుల వివరాలివే..
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్
ఇన్‌స్పెక్టర్
అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్
సబ్ ఇన్‌స్పెక్టర్
ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్
రిసెర్చ్ అసిస్టెంట్
8. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్
సబ్ ఇన్‌స్పెక్టర్/ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్
ఆడిటర్
అకౌంటెంట్
అకౌంటెంట్/ జూనియర్ అకౌంటెంట్
పోస్టల్ అసిస్టెంట్/ సార్టింగ్ అసిస్టెంట్
సీనియర్ సెక్రెటేరియంట్ అసిస్టెంట్/ అప్పర్ డివిజన్ క్లర్క్
సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్
టాక్స్ అసిస్టెంట్












Click it and Unblock the Notifications