ఏపీ ఇంటర్ ప్రాక్టికల్స్ హాల్‌టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారా..?
ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ విద్యార్ధులకు మరో కీలక అప్డేట్ ఇచ్చింది. 2024- 25 విద్యా సంవత్సరానికి ఇంటర్ విద్యార్ధులకు ఫిబ్రవరి 10 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు మొదలుకానున్నాయి. ఈ క్రమంలోనే అందుకు సంబంధించి హాల్ టిక్కెట్లను విడుదల చేసింది. ఆ హాల్ టికెట్లను BIEAP అధికారిక వెబ్‌సైట్ https://bie.ap.gov.in/ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవడానికి వెల్లడించింది.
ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానుండగా.. 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అదే విధంగా ఒకేషనల్ విద్యార్థులకు ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రాక్టికల్స్ జరగనున్నాయి. రెండు సెషన్లలో ఈ పరీక్షలను చేపట్టనున్నారు.

ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, వాటిని ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యాలయానికి అనుసంధానం చేసి పర్యవేక్షించనున్నారు. అదే విధంగా సమగ్ర శిక్ష ఒకేషనల్ ట్రేడ్ పరీక్షలను సైతం ఫిబ్రవరి 22వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించనున్నట్టు అధికారులు ప్రకటించారు.
మరోవైపు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఇంటర్ బోర్డు ఇంటర్ హాల్‌టికెట్లను విడుదల చేసింది.
ఈసారి వాట్సప్ గవర్నెన్స్.. మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009ను సేవ్ చేసుకుని ఇంటర్ హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ వాట్సాప్ నంబర్ ను సేవ్ చేసుకుని హాయ్ అని మెసేజ్ పెడితే పలు సర్వీసులు కనిపిస్తాయి. వాటిలో విద్యా సేవలపై క్లిక్ చేస్తే పరీక్ష హాల్ టికెట్ డౌన్ లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. అందులో ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అని చెబుతున్నారు. దానిపై క్లిక్ చేసి, మీ రోల్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేస్తే హాల్ టికెట్ మీ ఫోన్లోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications