Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణ గ్రూప్-2 పరీక్ష వాయిదాపై తేల్చేసిన హైకోర్టు

తెలంగాణ గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేసేందుకు రాష్ట్ర హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినందున వాయిదా వేయలేమని స్పష్టం చేసింది. డిసెంబర్ 16న రైల్వే పరీక్ష ఉందని, ఒకే రోజు గ్రూప్-2, రైల్వే పరీక్షలు ఉన్నందున పరీక్షను వేరే తేదీకి మార్చాలని కోరుతూ పలు పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి.

మరోవైపు, గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయడం వల్ల లక్షల మంది అభ్యర్థులు నష్టపోతారని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తరపు న్యాయవాది హైకోర్టుకు వివరించారు. ఇప్పటికే అభ్యర్థులంతా హాల్ టికెట్లు కూడా డౌన్‌లోడ్ చేసుకున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వారి వాదనలను పరిగణలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం పరీక్షను వాయిదా వేసేందుకు నిరాకరిస్తూ పిటిషన్లను కొట్టివేసింది.

High Court refuses to postpone Telangana Group-2 exams

గ్రూప్-2 హాల్ టికెట్లు విడుదల

తెలంగాణ గ్రూప్​-2 పరీక్ష హాల్ టికెట్లను సోమవారం నుంచి టీజీపీఎస్సీ అందుబాటులోకి తెచ్చింది. టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌​సైట్ ద్వారా డౌన్‌​లోడ్ చేసుకోవచ్చని అభ్యర్థులకు సూచించింది. డిసెంబర్ 15, 16వ తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు తెలంగాణ వ్యాప్తంగా జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1368 పరీక్ష కేంద్రాలను టీజీపీఎస్సీ​ ఏర్పాటు చేసింది. దాదాపుగా ఈ పరీక్షకు 5.51లక్షల దరఖాస్తులు వచ్చాయి.

రెండు రోజులపాటు వరుసగా ఉదయం, మధ్యాహ్నం కలిపి మొత్తం నాలుగు పేపర్లతో గ్రూప్‌-2 పరీక్షలు జరగనున్నాయి. ఉదయం జరిగే పేపర్​ -1, పేపర్​-3లకు 8 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతి నిరాకరిస్తారు.

హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ కోసం అభ్యర్థులు తమకు సంబంధించిన టీజీపీఎస్సీ ఐడీ నెంబర్, పుట్టిన తేదీ, క్యాప్‌చా కోడ్‌ను ఎంటర్‌ చేయాలి. ఆ తర్వాత డౌన్​లోడ్​ పీడీఎఫ్​ అనే ఆప్ష‌న్‌​పై క్లిక్​ చేస్తే వెంటనే హాల్ ​టికెట్​ డౌన్‌​లోడ్​ అవుతుంది.

గ్రూప్-2 హాల్‌​టికెట్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

ఈ ప్రక్రియలో ఏవైనా సమస్యలు తలెత్తితే పరిష్కరించేందుకు వీలుగా జిల్లాల వారీగా హెల్ప్‌లైన్‌ నంబర్లను ఏర్పాటు చేసింది టీజీపీఎస్సీ. అభ్యర్థులు పనిదినాల్లో ఉదయం 10.30గంటల నుంచి సాయంత్రం 6.00గంటల వరకు ఈ నంబర్లకు ఫోన్​ చేసి వివరాలను తెలుసుకోవచ్చు. ఇంకా అదనపు సమాచారం కావాలంటే టీజీపీఎస్సీ హెల్ప్‌లైన్‌ నంబర్లు 23542185/23542187/040-22445566/కు కాల్ చేయొచ్చు. లేదంటే [email protected]కు మెయిల్ కూడా చేయవచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+