మీరు ITI చేశారా ? ఎగ్జామ్ లేకుండానే అప్రెంటిస్ జాబ్స్ !!
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఐటీఐ అభ్యర్థులకు గుడ్ న్యూస్. హైదరాబాద్‌లోని హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) ఏవియానిక్స్ డివిజన్ 2026-27 సంవత్సరానికి గాను 205 ITI అప్రెంటిస్ ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన HALలో ఉద్యోగావకాశం రావడంతో యువతలో ఆసక్తి నెలకొంది.
ఈ నియామకాల ప్రత్యేకత ఏమిటంటే.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. వివిధ టెక్నికల్ ట్రేడ్‌లలో ఈ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుండటంతో ITI పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు.

ఏఏ ట్రేడ్‌లలో ఖాళీలు?
- ఎలక్ట్రానిక్స్ మెకానిక్
- ఫిట్టర్
- ఎలక్ట్రీషియన్
- మెషినిస్ట్
- టర్నర్
- వెల్డర్
- రిఫ్రిజిరేషన్ & AC
- COPA
- ప్లంబర్
- పెయింటర్
- డీజిల్ మెకానిక్
- మోటార్ వెహికల్ మెకానిక్
- డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్ & మెకానికల్)
- ఎలక్ట్రోప్లేటర్
అర్హతలు..
- సంబంధిత ట్రేడ్‌లో NCVT గుర్తింపు పొందిన ITI పూర్తి చేసి ఉండాలి
- భారత ప్రభుత్వ అప్రెంటిస్‌షిప్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి
- అవసరమైన ధృవపత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి
అప్రెంటిస్ చట్టం 1961 ప్రకారం ఎంపికైన వారికి నెలవారీ స్టైపెండ్ చెల్లించనున్నారు.
రిజర్వేషన్లు..
EWS, OBC, SC, ST, PH వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తామని HAL స్పష్టం చేసింది. దీంతో రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు కూడా మంచి అవకాశాలు లభించనున్నాయి.
ఇంటర్వ్యూల షెడ్యూల్..
ఇంటర్వ్యూలు హైదరాబాద్ బాలానగర్‌లోని HAL ఏవియానిక్స్ డివిజన్ - ఉత్సవ్ సదన్ ఆడిటోరియంలో నిర్వహించనున్నారు.
మే 28
- ఉదయం సెషన్: ఎలక్ట్రానిక్స్ మెకానిక్, డీజిల్ మెకానిక్
- మధ్యాహ్నం సెషన్: ఫిట్టర్, ప్లంబర్, పెయింటర్
మే 29
- ఉదయం సెషన్: COPA, మోటార్ వెహికల్ మెకానిక్
- మధ్యాహ్నం సెషన్: ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ మెకానికల్,
జూన్ 1
- ఉదయం సెషన్: మెషినిస్ట్, రిఫ్రిజిరేషన్ & AC,
- మధ్యాహ్నం సెషన్: డ్రాఫ్ట్స్‌మ్యాన్ సివిల్, వెల్డర్, ఎలక్ట్రోప్లేటర్
ఇంటర్వ్యూకు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్లు..
- ఆధార్ కార్డ్
- SSC మార్క్స్ మెమో
- ITI సర్టిఫికేట్
- పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం
- కుల ధృవీకరణ పత్రం (అవసరమైతే)
- అప్రెంటిస్‌షిప్ పోర్టల్ రిజిస్ట్రేషన్ కాపీ
- పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
అన్ని డాక్యుమెంట్ల ఒరిజినల్స్‌తో పాటు జిరాక్స్ కాపీలు కూడా తీసుకెళ్లాలని అధికారులు సూచించారు.
ప్రత్యేకంగా ఏరోనాటిక్స్, డిఫెన్స్ రంగాల్లో కెరీర్ నిర్మించుకోవాలనుకునే వారికి ఇది మంచి అవకాశం అని నిపుణులు చెబుతున్నారు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం HAL అధికారిక నోటిఫికేషన్‌ను పరిశీలించాలని అధికారులు సూచించారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే ముందు అన్ని అర్హతలు, డాక్యుమెంట్లు మరోసారి పరిశీలించుకోవడం మంచిదని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications