Free legal aid: ఉచిత న్యాయ సహాయం పొందడం ఎలా?
భారతదేశంలో ధనిక, పేద, కులం, మతం తేడా లేకుండా అన్ని వర్గాలు న్యాయం దృష్టిలో అందరూ సమానులే. అందరికీ సమాన అవకాశాలు కల్పించడం జరుగుతుంది. అయితే, పేదరికం కారణంగా కొందరు తమకు అందాల్సిన న్యాయం కోసం పోరాడటంలో వెనకబడి పోతున్నారు. ఇలాంటి వారందరికీ మన రాజ్యాంగం, ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయి. వాటికి సంబంధించిన వివరాలను తెలుసుకోవాల్సిన అవసరం అందరిపైనా ఉంది.
తమ హక్కులను కోల్పోకుండా పేద ప్రజలు ఉచిత న్యాయసాయాన్ని పొందవచ్చు. బీద, బలహీన వర్గాల వారికి న్యాయ విధానం అందుబాటులోకి తేవడం కోసం, వారికి సామాజిక, ఆర్థిక న్యాయాలు కల్పించడం కోసం ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలని నిశ్చయించాయి. ఫలితంగా 1976వ సంవత్సరంలో భారత రాజ్యాంగానికి అధికరణ 39-ఎ జతచేసి బీద, బలహీన వర్గాల వారికి ఉచిత న్యాయ సహాయాన్ని అందించడం రాష్ట ప్రభుత్వాల బాధ్యతగా నిర్దేశించారు.

అంతే కాకుండా ఇందుకోసం ఒక చట్టాన్ని రూపొందించారు. అదే న్యాయ సేవల అధికారాల చట్టం. ఇది కెంద్ర చట్టము. ఈ చట్టము నిర్దేశించినట్లు మన రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర హైకోర్టు ఉమ్మడిగా చర్చించి కొన్ని సూత్రాలను నిర్దేశికాలను రూపొందించాయి.
అరులు ఎవరంటే?
ఈ చట్టము, దాని అనుబంధ సూత్రాల ప్రకారము దిగువ కనబరచిన వారు ఉచితంగా న్యాయ సహాయం పొందడానికి అరులుగా నిర్ణయించారు.
షెడ్యూల్డ్ కులము లేక తెగకు చెందినవారు
మానవ అక్రమ రవాణా బాధితులు, బెగారులు
స్త్రీలు, పిల్లలు
మతిస్థిమితం లేనివారు, అవిటివారు సామూహిక విపత్తు, హింసాకాండ, కుల వైషమ్యాలు, అతివృష్టి, అనావృష్టి భూకంపాలు, పారిశ్రామిక విపత్తుల వంటి విపత్తులలో చిక్కుకున్నవారు.
పారిశ్రామిక కార్మికులు
ఇమ్మెరల్ ట్రాఫిక్ (ప్రివెన్షన్) చట్టము 1956లో సెక్షన్ 2 (జి)లో తెలిపిన "నిర్బంధము", లేక బాలనేరస్తుల న్యాయ చట్టము 1986 సెక్షన్ 2 (జె)లో తెలిపిన నిర్బంధము లేక మెంటల్ హెల్త్ చట్టము 1987 సెక్షన్(జి)లో తెలిపిన మానసిక వైద్యశాల లేక మానసిక చికిత్సాలయములో తెలిపిన "నిర్బంధము"లో ఉన్న వ్యక్తులు, వార్షిక ఆదాయం రూ. 1,00,000 (రూ లక్షకు మించని వ్యక్తులు కూడా ఉచిత న్యాయ సహాయం పొందడానికి అర్హత కలిగి ఉన్నారు. అర్హత గల వాది, ప్రతివాదులు కూడా న్యాయ సహాయం పొందవచ్చును.
ధరఖాస్తు చేయు పద్ధతి:
న్యాయ సహాయం కోరువారు తను కేసు యొక్క పూర్వాపరాలు, కావలసిన పరిష్కారము (రిలీఫ్) వివరిసూ అఫిడవిడ్ ను సంబంధిత డాక్యుమెంటులను జత చేసూ దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. దరఖాస్తుదారులు పైన తెలిపిన అర్హతలలో ఏవి కలిగి ఉన్నదీ తెలియపరుస్తూ తగిన ఆధారాలను (వీలైనంతమేరకు) పంపిన ఎడల నిబంధనల మేరకు తగు చర్య తీసుకోవడం జరుగుతుంది.
దరఖాస్తు చేయవలసిన చిరునామా:
ఉచిత న్యాయ సహాయము కోరువారు తమ తమ జిల్లాలకు చెందిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థలకు గాని, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు గానీ తమ కేసుల వివరములను తెలుపుతూ దరఖాస్తు చేసుకొనవచ్చును.
జిల్లా స్థాయిలో అయితే...
కార్యదర్శి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, సంబంధిత జిల్లా కోర్టు భవనములు
రాష్ట స్థాయిలో అయితే...
సభ్య కార్యదర్శి,తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, 2వ అంతస్తు, న్యాయసేవా సదన్, సిటిసివిల్ కోర్టు భవనములు, పూరానీహవేలి, హైదరాబాద్ - 500 002.
లేదా
హైకోర్టులో..
హైదరాబాద్ హైకోర్టులో గల కేసుల యందు న్యాయ సహాయం కోరువారు క్రింది చిరునామాకు దరఖాస్తు చేసుకోచ్చను.
కార్యదర్శి,హైకోర్టు న్యాయ సేవాధికార సంఘం, హైకోర్టు భవనములు, హైదరాబాద్ - 500 066.
న్యాయ సహాయ విధానాలు :
న్యాయవాదిచే ఉచితముగా న్యాయ సలహా ఇప్పించుట
కేసులను పరిశీలించిన మీదట అవసరమైనచో దరఖాస్తుదారుని తరపున న్యాయవాదులను నియమించి ఆయా కోర్టులలో కేసులు చేపట్టుట.
న్యాయ సహాయం పొందినవారికి కోర్టు ఫీజు, కేసుకు సంబంధించిన కోర్టు ఖర్చులు భరించుట.
న్యాయ సహాయం పొందినవారికి ఆయా కేసుల్లో జడ్జిమెంట్లు నకల్లు ఉచితముగా ఇచ్చుట. మొదలగు సహాయాలు అందిస్తారు.
ఈ సమాచారం తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సౌజన్యంతో అందించడం జరిగింది.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications