Hyderabad HAL: అప్రెంటీస్ పోస్టుల కోసం వెంటనే అప్లై చేయండి, ఫీజు లేదు
హైదరాబాద్: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) అప్రెంటీస్ చట్టం ప్రకారం జనరల్ స్ట్రీమ్, డిప్లొమా అప్రెంటిస్‌లలో 150 గ్రాడ్యుయేట్/డిప్లొమా/టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు మే 23/24/25, 2023న షెడ్యూల్ చేయబడిన వాక్-ఇన్-ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.
మొత్తం ఖాళీలు: 150
ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్: 74
టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్: 52
జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్: 24

ట్రేడ్/విభాగాలు: ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఏరోనాటికల్ ఇంజినీరింగ్, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్, ఫార్మసీ, ఎంఎల్‌టీ, బీకాం, బీఎస్సీ.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా/డిగ్రీ.
ఎంపిక ప్రక్రియ: డిప్లొమా/డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూ, రాత పరీక్ష.
దరఖాస్తు ఫీజు లేదు.
వాన్ ఇన్ తేదీలు: మే 23, 24, 25
178 ట్రేడ్ అప్రెంటీస్ ఖాళీలు:
హెచ్ఏఎల్ అప్రెంటీస్ శిక్షణలో భాగంగా 178 ఐటీఐ ట్రేడ్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ట్రేడ్: ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెషనిస్ట్, టర్నర్, వెల్డర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ, సీవోపీఏ, ప్లంబర్, పెయింటర్, డీజిల్ మెకానిక్, మోటార్ వెహికిల్ మెకానిక్, డ్రాఫ్ట్స్ మ్యాన్- సివిల్, డ్రాఫ్ట్ మ్యాన్-మెకానికల్.
అర్హత సంబంధిత ట్రేడులో ఐటీఐ.
వాక్ ఇన్ తేదీలు: మే 17, 18, 19.
చిరునామా: ఆడిటోరియం, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్‌మెంట్, హెచ్ఏఎల్ ఏవియేషన్స్ డివిజన్, బాలానగర్, హైదరాబాద్
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి












Click it and Unblock the Notifications