IAF Jobs:10వ తరగతి పాసయ్యారా.. డిగ్రీ చేశారా-అయితే ఈ ఉద్యోగాలు మీకోసమే..!!
భారత వాయుసేన లేదా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ గ్రూప్ సీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 174 సివిలియన్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగి అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 30 సెప్టెంబర్ 2021.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో సివిలియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సివిలియన్ విభాగంలో సూపరింటెండెంట్ (స్టోర్), లోవర్ డివిజన్ క్లర్క్ (ఎల్‌డీసీ), కుక్, హిందీ టైపిస్టు, స్టోర్ కీపర్, కార్పెంటర్, హౌజ్ కీపింగ్ స్టాఫ్, మెస్ స్టాఫ్, ఎంటీఎస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక ఒక్కో పోస్టుకు ఒక్కో విద్యార్హతలు ఉన్నాయి.

సూపరింటెండెంట్ (స్టోర్): గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ (వేతనం: నెలకు రూ. 25,500/- నుంచి Rs. 81,100/)
ఎల్‌డీసీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతిలో ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లీషులో నిమిషానికి 35 పదాలు, హిందీలో నిమిషానికి 30 పదాలు టైప్ చేయగల సామర్థ్యం ఉండాలి (వేతనం: నెలకు రూ. 19,900/- నుంచి Rs. 63,200/)
కుక్: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు కేటరింగ్‌లో డిప్లొమా కలిగి ఈ ట్రేడ్‌లో ఏడాది అనుభవం ఉండాలి (వేతనం: నెలకు రూ. 19,900/- నుంచి Rs. 63,200)
స్టోర్ కీపర్: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి 12వ తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. (వేతనం: నెలకు రూ. 19,900/- నుంచి Rs. 63,200)
పెయింటర్: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ (వేతనం: నెలకు రూ. 19,900/- నుంచి Rs. 63,200)
కార్పెంటర్: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి ( వేతనం: నెలకు రూ. 19,900/- నుంచి Rs. 63,200)
హౌజ్ కీపింగ్ స్టాఫ్: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి పాస్ అయి ఉండాలి (వేతనం: నెలకు రూ. 18000- 56,900/-)
మెస్ స్టాఫ్: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి పాస్ అయి ఉండాలి (వేతనం: నెలకు రూ. 18000- 56,900/-)
ఎంటీఎస్: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి (వేతనం: నెలకు రూ.18000- 56,900/-)
ఇక పోస్టుల ఖాళీల సంఖ్యను చూస్తే సూపరింటెండెంట్(స్టోర్) 6 పోస్టులు, లోవర్ డివిజన్ క్లర్క్ 10 పోస్టులు, స్టోర్ కీపర్ 6 పోస్టులు, కుక్ 23 పోస్టులు, పెయింటర్ 2 పోస్టులు, కార్పెంటర్ 3 పోస్టులు, హౌజ్ కీపింగ్ స్టాఫ్ 1 పోస్టు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 103 పోస్టులు ఉన్నాయి.
ఇక రాత పరీక్ష, నైపుణ్యత ప్రాక్టికల్ మరియు ఫిజికల్ టెస్టు ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 25 ఏళ్లు మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు దివ్యాంగులకు 10 ఏళ్లు సడలింపు ఉంటుంది. ఏడవ వేతన సంఘం సూచించిన స్కేల్ ప్రకారం వేతనం ఉంటుంది.
అర్హులైన అభ్యర్థులు సూచించిన విధంగా అప్లికేషన్లు పూర్తి చేసి తమకు దగ్గరలో ఉన్న ఏదైనా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు పంపాల్సి ఉంటుంది. అన్ని వివరాలకు తగ్గట్టుగా డాక్యుమెంట్స్ పొందుపర్చాల్సి ఉంటుంది. ఆర్డనరీ పోస్టు ద్వారా దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. 30 సెప్టెంబరు 2021లోగా ఆ దరఖాస్తులు అందేలా అభ్యర్థులు ప్లాన్ చేసుకోవాలి. మరిన్ని వివరాలకు https://indianairforce.nic.in/ సందర్శించండి.
-
2026 ఏడాదిలో ఫ్రెషర్స్ కోసం టాప్ 10 బెస్ట్ జాబ్స్ ఇవే ..! -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్












Click it and Unblock the Notifications