Indian Airforceలో 255 గ్రూప్ సీ పోస్టులకు నోటిఫికేషన్..అర్హతలు వివరాలు ఇవే..!

న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్‌లో పలు గ్రూప్ సీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాలు సౌత్ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ పరిధిలో జరుగుతాయి. ఆసక్తి ఉండి అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోగలరు. ఆఫ్‌లైన్ ద్వారా పూర్తి వివరాలతో కూడిన అప్లికేషన్ నింపి పోస్టు ద్వారా పంపాల్సి ఉంటుంది.

మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హౌజ్ కీపింగ్ స్టాఫ్, మెస్ స్టాఫ్, ఎల్‌డీసీ, హిందీ టైపిస్టు క్లర్క్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ -II, స్టోర్ (సూపరింటెండెంట్), లాండ్రీ మ్యాన్, స్టోర్ కీపర్, ఆయా/వార్డు సహాయిక, కార్పెంటర్, పెయింటర్, వాల్కనైజర్, డ్రైవర్, వంట మనిషి, ఫైర్ మ్యాన్ ఉద్యోగాల భర్తీకి ఎయిర్ ఫోర్స్ ప్రకటన విడుదల చేసింది. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి దరఖాస్తులు సబ్మిట్ చేయొచ్చని నోటిఫికేషన్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పేర్కొంది. పూర్తి వివరాలతో నింపిన దరఖాస్తులు కింద చిరునామాకు చేరవలసిన చివరి తేదీ 13 మార్చి 2021.

IAF Recruitment 2021:Apply for 255 various group C posts

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలకు ఎలా అప్లయ్ చేయాలి..?

indianairforce.nic.in అనే వెబ్‌సైట్‌ను సందర్శించి అందులో పొందుపర్చిన అప్లికేషన్ ఫారంను డౌన్‌లోడ్ చేసుకుని హిందీలో లేదా ఇంగ్లీషులో పూర్తి చేయాల్సి ఉంటుంది. అంతేకాదు అప్లికేషన్ పై ఒక పాస్ పోర్ట్ సైజు ఫోటోను అతికించాలి. పూర్తి చేసిన అప్లికేషన్‌ను ఏదైనా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ వద్ద అందజేయొచ్చు. ఇక అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు రాతపరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. ప్రశ్నాపత్రం నాలుగు సెక్షన్ల కింద ఉంటుంది. ఒకటి జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్‌కు సంబంధించి ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నలు ఇంగ్లీషుతో పాటు హిందీలో కూడా ఉంటాయి.

ముఖ్య తేదీలు:
అప్లికేషన్లు ప్రారంభ తేదీ: 11 ఫిబ్రవరి 2021

అప్లికేషన్లు చేరేందుకు చివరి తేదీ: 13 మార్చి 2021.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+