IAF Jobs:10వ తరగతి పాసైతే..గ్రూప్ సీ పోస్టులకు అప్లయ్ చేయండి..అర్హతలు ఇవే..!!
భారత వాయుసేన లేదా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ గ్రూప్ సీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 85 సివిలియన్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగి అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 23 ఆగష్టు 2021.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో సివిలియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సివిలియన్ విభాగంలో సూపరింటెండెంట్ (స్టోర్), లోవర్ డివిజన్ క్లర్క్ (ఎల్‌డీసీ), కుక్, హిందీ టైపిస్టు, స్టోర్ కీపర్, కార్పెంటర్, హౌజ్ కీపింగ్ స్టాఫ్, మెస్ స్టాఫ్, ఎంటీఎస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక ఒక్కో పోస్టుకు ఒక్కో విద్యార్హతలు ఉన్నాయి.

సూపరింటెండెంట్ (స్టోర్): గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
ఎల్‌డీసీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతిలో ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లీషులో నిమిషానికి 35 పదాలు, హిందీలో నిమిషానికి 30 పదాలు టైప్ చేయగల సామర్థ్యం ఉండాలి
కుక్: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు కేటరింగ్‌లో డిప్లొమా కలిగి ఈ ట్రేడ్‌లో ఏడాది అనుభవం ఉండాలి
హిందీ టైపిస్టు: 10+2లో ఉత్తీర్ణతతో పాటు హిందీలో నిమిషానికి 30 పదాలు టైప్ చేయగలగాలి.
స్టోర్ కీపర్: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి 12వ తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి.
కార్పెంటర్: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి
హౌజ్ కీపింగ్ స్టాఫ్: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి పాస్ అయి ఉండాలి
మెస్ స్టాఫ్: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి పాస్ అయి ఉండాలి
ఎంటీఎస్: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి
ఇక రాత పరీక్ష, నైపుణ్యత ప్రాక్టికల్ మరియు ఫిజికల్ టెస్టు ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 25 ఏళ్లు మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు దివ్యాంగులకు 10 ఏళ్లు సడలింపు ఉంటుంది. ఏడవ వేతన సంఘం సూచించిన స్కేల్ ప్రకారం వేతనం ఉంటుంది.
అర్హులైన అభ్యర్థులు సూచించిన విధంగా అప్లికేషన్లు పూర్తి చేసి తమకు దగ్గరలో ఉన్న ఏదైనా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు పంపాల్సి ఉంటుంది. అన్ని వివరాలకు తగ్గట్టుగా డాక్యుమెంట్స్ పొందుపర్చాల్సి ఉంటుంది. ఆర్డనరీ పోస్టు ద్వారా దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. 23 ఆగష్టు 2021లోగా ఆ దరఖాస్తులు అందేలా అభ్యర్థులు ప్లాన్ చేసుకోవాలి. మరిన్ని వివరాలకు https://indianairforce.nic.in/ సందర్శించండి.
-
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం..












Click it and Unblock the Notifications