IBPS RRB నోటిఫికేషన్ రిలీజ్.. 13,217 పోస్టులు !!
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) సంస్థ 2025-26 సంవత్సరానికి సంబంధించి సీఆర్‌పీ ఆర్‌ఆర్‌బీ XIV నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో పోస్టులను భర్తీ చేయనున్నట్లు IBPS ప్రకటించింది. మొత్తంగా 13,217 ఉద్యోగాలకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగా..బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలి అనుకునే వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు.
మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంత బ్యాంకుల్లో పనిచేయాలనుకునే వారికి ఇది మంచి కెరీర్ అవకాశంగా భావించవచ్చు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. ఈ నియామకాలకు సంబంధించి పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా...

మొత్తం ఖాళీలు..
13,217
పోస్టుల వివరాలు..
- ఆఫీస్ అసిస్టెంట్స్ (మల్టిపర్పస్): 7,972
- ఆఫీసర్ స్కేల్-I (అసిస్టెంట్ మేనేజర్): 3,907
- ఆఫీసర్ స్కేల్-II (అగ్రికల్చర్ ఆఫీసర్): 50
- ఆఫీసర్ స్కేల్-II (లా ఆఫీసర్): 48
- ఆఫీసర్ స్కేల్-II (చార్టర్డ్ అకౌంటెంట్ - CA): 69
- ఆఫీసర్ స్కేల్-II (ఐటీ ఆఫీసర్): 87
- ఆఫీసర్ స్కేల్-II (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ - GBO): 854
- ఆఫీసర్ స్కేల్-II (మార్కెటింగ్ ఆఫీసర్): 15
- ఆఫీసర్ స్కేల్-II (ట్రేజరీ మేనేజర్): 16
- ఆఫీసర్ స్కేల్-III: 199
విద్యార్హతలు..
సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ (కనీసం 50% మార్కులు తప్పనిసరి). కొన్ని పోస్టులకు ఎంబీఏ, సీఏ, ఐటీ స్పెషలైజేషన్ అర్హతగా ఉంటుంది. అలానే స్థానిక భాషలో ప్రావీణ్యం తప్పనిసరి.
ఉద్యోగ అనుభవం:
ఆఫీసర్ స్కేల్ II, III పోస్టులకు సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
వయో పరిమితి..
01.06.2025 నాటికి
- ఆఫీస్ అసిస్టెంట్: 18 - 28 ఏళ్లు
- ఆఫీసర్ స్కేల్-I: 18 - 30 ఏళ్లు
- ఆఫీసర్ స్కేల్-II: 21 - 32 ఏళ్లు
- ఆఫీసర్ స్కేల్-III: 21 - 40 ఏళ్లు
ప్రభుత్వ నియమావళి ప్రకారం రిజర్వేషన్ కేటగిరీలకు వయో పరిమితి సడలింపు లభిస్తుంది.
ఎంపిక విధానం..
- ఆఫీస్ అసిస్టెంట్: ప్రిలిమినరీ పరీక్ష + మెయిన్స్ పరీక్ష (ఇంటర్వ్యూ లేదు)
- ఆఫీసర్ స్కేల్-I: ప్రిలిమినరీ పరీక్ష + మెయిన్స్ పరీక్ష + ఇంటర్వ్యూ
- ఆఫీసర్ స్కేల్-II & III: సింగిల్ ఆన్‌లైన్ పరీక్ష + ఇంటర్వ్యూ
పరీక్ష..
అన్ని పరీక్షలు హిందీ, ఇంగ్లీష్‌తో పాటు స్థానిక భాషల్లో నిర్వహించబడతాయి.
దరఖాస్తు విధానం..
పూర్తిగా ఆన్‌లైన్ మోడ్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ www.ibps.in ని సందర్శించవచ్చు.
దరఖాస్తు ఫీజు..
- SC / ST / PWD / ESM / DESM అభ్యర్థులకు: రూ.175
- ఇతర కేటగిరీ అభ్యర్థులకు: రూ.850
దరఖాస్తు గడువు..
ఇప్పటికే దరఖాస్తులు ప్రారంభం అవ్వగా చివరి తేదీగా 28.09.2025 గా నిర్ణయించారు. కాగా ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ (PET): అక్టోబర్ 2025 లో జరగనుండగా.. ప్రిలిమినరీ పరీక్షలు నవంబర్ 2025 లో.. మెయిన్స్ పరీక్షలు డిసెంబర్ 2025 లో ఉండనున్నాయి. అలానే ఇంటర్వ్యూలు 2026లో జనవరి - ఫిబ్రవరి మధ్య ఉండవచ్చని.. ఫైనల్ రిజల్ట్స్ & ప్రొవిజనల్ అలోట్మెంట్ ఏప్రిల్ 2026 లో జరగవచ్చని స్పష్టం చేస్తున్నారు.
-
క్రేజీ జాబ్ అప్డేట్.. నెలకు రూ.1,40,000 వరకు జీతంతో ఉద్యోగాలు..! -
పోలీస్ శాఖలో కొలువుల జాతర!, ఏ క్షణమైనా మెగా నోటిఫికేషన్? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ?












Click it and Unblock the Notifications