Bank Jobs:నిరుద్యోగులకు గుడ్ న్యూస్: 10వేలకు పైగా బ్యాంకు ఉద్యోగాలు: పూర్తి వివరాలు ఇక్క చెక్ చేయండి..!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఎప్పటిలానే మరోసారి బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. బ్యాంకులో ఉద్యోగాలు పొందాలనుకుని ఇందుకోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులకు ఇదో మంచి అవకాశం. అన్ని బ్యాంకులకు కలిపి ఉమ్మడి పరీక్ష ప్రతి ఏటా జరుగుతుంది. ఈ పరీక్షను ఐబీపీఎస్ నిర్వహిస్తుంది. ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ అన్ని బ్యాంకుల్లో ఉన్న ఖాళీల భర్తీ కోసం ఏటా నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఇక తాజాగా వెలువడిన నోటిఫికేషన్ ప్రకారం పలు పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొంది ఐబీపీఎస్.
ఇక తాజా నోటిఫికేషన్ ప్రకారం, ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్-I,ఆఫీసర్ స్కేల్-II,జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్, ఆఫీసర్ స్కేల్ -II ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్, ఆఫీసర్ స్కేల్ -II చార్టర్డ్ అకౌంటెంట్, ఆఫీసర్ స్కేల్ -II లా ఆఫీసర్, ట్రెజరీ ఆఫీసర్ స్కేల్-II, మార్కెటింగ్ ఆఫీసర్ స్కేల్-II, అగ్రికల్చర్ ఆఫీసర్ స్కేల్ -II,ఆఫీసర్ స్కేల్ -III వేకన్సీలను భర్తీ చేయనుంది. ఇక మొత్తం పోస్టులు 10293 భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఐబీపీఎస్. అర్హులైన అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం www.ibps.inను సందర్శించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జూన్ 8వ తేదీ నుంచి ప్రారంభమైంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 2021 జూన్ 28.

ఇక పైన పేర్కొనబడిన పోస్టులకు అర్హతలు ఇలా ఉన్నాయి. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత. ఎల్ఎల్‌బీ, సీఏలలో ఉత్తీర్ణులై ఉండాలి. మరిన్ని విద్యార్హతల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడగలరు. ఇక ఆయా పోస్టులకు అభ్యర్థుల వయస్సు ఒక్కో రకంగా ఉంది. ఏ పోస్టుకు కనిష్ట గరిష్ట వయసు ఎంతుందో తెలుసుకునేందుకు అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ చూడగలరు. కనిష్ట వయస్సు 18 ఏళ్లు గరిష్ట వయస్సు 40 ఏళ్లుగా పేర్కొన్నారు. ఈ వయసు ఉన్నవారు మాత్రమే ఆయా పోస్టులకు అర్హులు. ఇక ప్రభుత్వ రిజర్వేషన్లు వర్తిస్తాయి. జనరల్ ఓబీసీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.850గా ఉండగా.. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఫీజు రూ.175గా నిర్ణయించారు. ఆన్‌లైన్ ద్వారా పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఆ తర్వాత ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ముఖ్యతేదీలు:
Recommended Video
* ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరణ: 2021 జూన్ 8
* అన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 2021 జూన్ 28
* అప్లికేషన్ ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ: 2021 జూన్ 28
* కాల్ లెటర్ డౌన్‌లోడ్ మరిచు ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ : 2021 9 జూలై
* ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ తేదీలు: 2021 జూలై 9 నుంచి జూలై 25 వరకు.
* మరిన్ని వివరాలకు www.ibps.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
-
డబ్బులు చెల్లించే ముందు QR కోడ్ చెక్ చేస్తున్నారా ? నిజమైందేనా ?? నకిలీదా ??? -
Job Calendar: ఏపీలో జాబ్ క్యాలెండర్ ఖరారు? ఇవాళ సర్కార్ కీలక భేటీ..! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్












Click it and Unblock the Notifications