Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IBPS Recruitment 2021: పీఓ పోస్టులకు అప్లయ్ చేయండి..జీతం 65వేలు.!!

ప్రముఖ బ్యాంకింగ్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ పర్సనల్ సెలెక్షన్‌ (ఐబీపీఎస్) దేశవ్యాప్తంగా పలు జాతీయ బ్యాంకుల్లో ప్రొబేషనరీ లేదా మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా మొత్తం 4135 పీఓ/ఎంటీ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 11 బ్యాంకులు ఈ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొంటున్నాయి. వేతనం విషయానికొస్తే ఎంపికైప అభ్యర్థులకు నెలకు రూ. 55000/- నుంచి రూ.65000/- వరకు ఉంటుంది. ఈ ఉద్యోగాలన్నీ శాశ్వత ప్రాతిపదికనే భర్తీ చేయడం జరుగుతుంది. అయితే ఎంపికైన అభ్యర్థులు దేశంలో ఎక్కడైనా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలి.

ఇక ఐబీపీఎస్ చేపట్టనున్న పీఓ/ఎంటీ అర్హతలను పేర్కొంది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ ఉండాలి. ఇక అభ్యర్థుల వయస్సు 20 నుంచి 30 ఏళ్లు ఉండాలి. అది కూడా 2021 అక్టోబర్ 1 నాటికి ఉండాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇక ఏ బ్యాంకుల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్యాంక్ ఆఫ్ ఇండియా -588
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర - 400
కెనరా బ్యాంక్ - 650
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - 620
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ - 98
పంజాబ్ & సింద్ బ్యాంక్ -427
యూకో బ్యాంక్ - 440
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - 912

IBPS Recruitment 2021:Apply for 4135 PO/MT posts,Here are the details

ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లకు సంబంధించి ఖాళీల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ పోస్టుల వివరాలు కూడా వెల్లడైతే పోస్టుల సంఖ్య మరింత పెరుగుతాయి.

సంస్థ పేరు:ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ పర్సనల్ సెలెక్షన్‌ (ఐబీపీఎస్ )
పోస్టు పేరు: పీఓ/ఎంటీ
పోస్టుల సంఖ్య: 4135
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 10 నవంబర్ 2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ

వయస్సు: 20 - 30 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్ష

అప్లికేషన్ ఫీజు:
జనరల్ అభ్యర్థులకు : రూ.800/-
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు : రూ.175/-

ముఖ్యతేదీలు:
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 20 అక్టోబర్ 2021
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 10 నవంబర్ 2021
ఆన్‌లైన్ ద్వారా ప్రిలిమినరీ పరీక్ష - 4 డిసెంబర్ నుంచి 11 డిసెంబర్ 2021 వరకు జరిగే అవకాశాలున్నాయి

మరిన్ని వివరాలకు

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+