IBPS Recruitment 2021: బ్యాంకుల్లో 7వేలకు పైగా క్లర్కు ఉద్యోగాలు..అర్హతలు ఇవే..!!
ప్రముఖ బ్యాంకింగ్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్) దేశవ్యాప్తంగా పలు జాతీయ బ్యాంకుల్లో క్లర్కు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా మొత్తం 7855 క్లర్కు పోస్టులను భర్తీ చేయనుంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్‌లో 387 పోస్టులను భర్తీ చేయనుండగా..తెలంగాణలో 333 పోస్టులను భర్తీ చేయనుంది. ఇక పొరుగు రాష్ట్రాలైన తమిళనాడులో 843 క్లర్కు పోస్టులను భర్తీ చేయనుండగా.. కర్నాటకలో 454 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
ఇక ఐబీపీఎస్ చేపట్టనున్న క్లర్కుకు అర్హతలను పేర్కొంది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ ఉండాలి. ఇక అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 ఏళ్లు ఉండాలి. అంటే అభ్యర్థి 2 జూలై 1993 నుంచి 1 జూలై 2001 మధ్య జన్మించి ఉండాలి.

సంస్థ పేరు:ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్ )
పోస్టు పేరు: క్లర్కు
పోస్టుల సంఖ్య: 7855
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 27 అక్టోబర్ 2021
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు: 20 - 28 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్ష
అప్లికేషన్ ఫీజు:
జనరల్ అభ్యర్థులకు : రూ.850/-
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు : రూ.175/-
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 27 అక్టోబర్ 2021
మరిన్ని వివరాలకు :
లింక్: ibps.in












Click it and Unblock the Notifications