IBPS RRB recruitment: 8600కుపైగా ఉద్యోగాలు, వెంటనే అప్లై చేయండి
హైదరాబాద్: బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త. దేశ వ్యాప్తంగా రీజినల్ రూరల్ బ్యాంక్(RRB)ల్లో భారీ మొత్తంలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(IBPS) 8వేలకుపైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్-XII(CRP)ల ద్వారా మొత్తం 8612 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు క్లర్క్, పీవో, ఆఫీసర్స్ స్కేల్ II, III స్థాయి పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
అర్హులైన అభ్యర్థులు జూన్ 1 నుంచి 21 వరకు https://www.ibps.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆయా పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులను అర్హులుగా నిర్ణయించారు. ఆన్‌లైన్ టెస్ట్(ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఈ పోస్టులపై రిక్రూట్‌మెంట్:
ఈ ప్రక్రియ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాల్లో
క్లర్క్- 5538
పీవో- 2485
ఆఫీసర్ స్కేల్-II జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్- 332
ఆఫీసర్ స్కేల్ 2 IT- 68
ఆఫీసర్ స్కేల్ 2 CA- 21
ఆఫీసర్ స్కేల్ 2 లా ఆఫీసర్- 24
ట్రెజరీ ఆఫీసర్ స్కేల్ 2- 8
మార్కెటింగ్ ఆఫీసర్ స్కేల్ 2- 3
అగ్రికల్చర్ - 60
ఆఫీసర్ స్కేల్ 3 - 73 చొప్పున్ ఉన్నాయి.
ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ షెడ్యూల్:
దరఖాస్తు స్వీకరణ: జూన్ 1 నుంచి జూన్ 21 వరకు
ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ప్రీ ఎగ్జామ్ టెస్ట్(PET): జులై 17 నుంచి 22 వరకు
ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్(TET) కాల్ లెటర్ల డౌన్‌లోడ్: జులై 10
ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్ ప్రిలిమ్స్ ఆన్‌లైన్ పరీక్ష ఆగస్టులో జరిగే అవకాశం
ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు, మెయిన్స్ పరీక్ష సెప్టెంబర్‌లో జరిగే అవకాశం ఉంది.
మెయిన్స్ ఫలితాలు అక్టోబర్‌లో ప్రకటించి.. అక్టోబర్/నవంబర్ నెలల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
ప్రొవిజనల్ అలాట్‌మెంట్: జనవరి, 2024
దరఖాస్తు రుసు:
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ ఎక్స్ సర్వీస్‌మెన్ రూ. 175: ఇతరులు రూ. 850
ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్, పీవో(అసిస్టెంట్ మేనేజర్) విద్యార్హత గ్రాడ్యూయేషన్ ఉంటే చాలు. ఎలాంటి అనుభవం అవసరం లేదు.
వేతనం: ఉద్యోగాల హోదాను బట్టి నెలకు కనీసం రూ. 15 వేల నుంచి గరిష్టంగా రూ. 44వేలు వరకు ఉంటుంది.
మరిన్ని వివరాలు, నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
https://www.ibps.in/wp-content/uploads/Final_Ad_CRP_RRB_XII.pdf
-
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications