నక్క తోక తొక్కిన ఐఐటీ- హైదరాబాద్: టాప్-10లో ఆంధ్రా యూనివర్శిటీ
IISc: దేశంలో వివిధ జాతీయస్థాయి విద్యాసంస్థలు, కళాశాలల ర్యాంకింగులు విడుదల అయ్యాయి. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కొద్దిసేపటి కిందటే వాటిని విడుదల చేశారు. ఐఐటీ, ఎన్ఐటీ, యూనివర్శిటీలు, ఇతర విద్యాసంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి.
అత్యుత్తమ యూనివర్శిటీల్లో..
దేశంలో అత్యుత్తమ యూనివర్శిటీల్లో బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అగ్రస్థానంలో నిలిచింది. జేఎన్‌టీయూ- ఢిల్లీ, జామియా మిల్లియా ఇస్లామియా- ఢిల్లీ, మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్- మణిపాల్, బనారస్ హిందూ యూనివర్శిటీ- వారణాసి, యూనివర్శిటీ ఆఫ్ ఢిల్లీ, అమృత విశ్వ విద్యాపీఠం- కోయంబత్తూరు, అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ- యూపీ, జాదవ్ పూర్ యూనివర్శిటీ- కోల్‌కత, వెలూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- వేలూరు.. తొలి 10 స్థానాల్లో ఉన్నాయి.

ఇన్నోవేషన్ కేటగిరీలో..
ఇన్నోవేషన్ కేటగిరీలో ఐఐటీ- బాంబే, ఓవరాల్ విభాగంలో ఐఐటీ- మద్రాస్ అగ్రస్థానంలో నిలిచాయి. ఈ విభాగంలో ఐఐటీ- హైదరాబాద్ మూడోస్థానంలో నిలిచింది. ఐఐటీ- కాన్పూర్, ఐఐటీ- రూర్కీ, ఐఐటీ- ఢిల్లీ, ఐఐటీ- మండీ (హిమాచల్ ప్రదేశ్), ఐఐటీ- ఖరగ్‌పూర్, అన్నా యూనివర్సిటీలు తొలి 10 స్థానాల్లో నిలిచాయి.
పరిశోధనల్లో..
రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కెేటగిరీలో బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది. ఈ విభాగంలో అగ్రస్థానంలో నిలిచింది. దీని తరువాత ఐఐటీ- మద్రాస్, ఐఐటీ- ఢిల్లీ, ఐఐటీ- బాంబే, ఐఐటీ- ఖరగ్‌పూర్ తొలి అయిదు స్థానాల్లో నిలిచాయి.
డెంటల్ కాలేజీల్లో..
డెంటల్ కాలేజీల విభాగంలో చెన్నైలోని సవీత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్స్ టాప్‌లో ఉంది. మణిపాల్ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్- కర్ణాటక, మౌలానా ఆజాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్- న్యూఢిల్లీ, కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ- లక్నో,
డాక్టర్ డీవై పాటిల్ విద్యాపీఠ్- పూణే.. తొలి అయిదు స్థానాల్లో ఉన్నాయి.
మెడికల్ కాలేజీల్లో..
వైద్య విద్యను బోధించే కళావాల్లో దేశ రాజధానిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)దే అగ్రస్థానం. ఆ తరువాత పీజీఐఎంఈఆర్- చండీగఢ్, క్రిస్టియన్ మెడికల్ కాలేజీ- వేలూరు, నిమ్హాన్స్- బెంగళూరు, జిప్మర్- పుదుచ్చేరి తొలి అయిదు స్థానాలను సాధించాయి.
ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విభాగంలో..
ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విభాగంలో.. ఐఐటీ- రూర్కీ దుమ్ము లేపింది. ఈ కేటగిరీలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. అనంతరం ఐఐటీ- ఖరగ్‌పూర్, ఎన్ఐటీ- కాలికట్, ఐఐఈఎస్‌టీ- శివ్‌పూర్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్- న్యూఢిల్లీ తొలి అయిదు స్థానాలను దక్కించుకున్నాయి.
లా కాలేజీల్లో..
ఈ సంవత్సరం టాప్ లా ఇన్‌స్టిట్యూట్‌లల్లో బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ అగ్రస్థానాన్ని ఆక్రమించింది. నేషనల్ లా యూనివర్సిటీ- ఢిల్లీ, నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా- హైదరాబాద్, వెస్ట్ బెంగాల్ నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ జురిడికల్ సైన్స్- కోల్‌కతా, సింబయాసిస్ లా స్కూల్- పూణే మిగిలిన స్థానాల్లో ఉన్నాయి.
టాప్ కాలేజీలు ఇవే..
దేశంలోని టాప్ కళాశాలల జాబితాలో ఢిల్లీలోని హిందూ కాలేజీ తొలి స్థానంలో నిలిచింది. మిరాండా హౌస్- ఢిల్లీ, సెయింట్ స్టీఫెన్స్ కళాశాల- ఢిల్లీ, రామకృష్ణ మిషన్ వివేకానంద సెంటెనరీ కాలేజ్- కోల్‌కత, ఆత్మారామ్ సనాతన్ ధర్మ కళాశాల- ఢిల్లీ, సెయింట్ జేవియర్స్ కాలేజ్- కోల్‌కత, పీఎస్‌జీఆర్ కృష్ణమ్మాళ్ మహిళా కళాశాల- కోయంబత్తూరు, లయోలా కాలేజ్- చెన్నై, కిరోడిమల్ కాలేజ్- ఢిల్లీ, లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ ఉమెన్- ఢిల్లీ తొలి 10 స్థానాల్లో ఉన్నాయి.
టాప్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లల్లో..
ఐఐఎం- అహ్మదాబాద్, ఐఐఎం- బెంగళూరు, ఐఐఎం- కోజికోడ్, ఐఐటీ- ఢిల్లీ (మేనేజ్‌మెంట్ కోర్స్), ఐఐఎం- కలకత్త, ఐఐఎం- ముంబై, ఐఐఎం- లక్నో, ఐఐఎం- ఇండోర్, ఎక్స్‌ఎల్‌ఆర్ఐ- జంషెడ్‌పూర్, ఐఐటీ- బాంబే (మేనేజ్‌మెంట్ కోర్స్) ఈ జాబితాలో తొలి 10 స్థానాల జాబితాలో ఉన్నాయి.
ఇంజినీరింగ్‌లో..
ఇంజినీరింగ్ విభాగంలో ఐఐటీ- మద్రాస్ అగ్రస్థానంలో నిలిచింది. ఐఐటీ- ఢిల్లీ, ఐఐటీ- బాంబే, ఐఐటీ- కాన్పూర్, ఐఐటీ- ఖరగ్‌పూర్, ఐఐటీ- రూర్కీ, ఐఐటీ- గౌహతి, ఐఐటీ- హైదరాబాద్, ఎన్ఐటీ- తిరుచిరాపల్లి, ఐఐటీ- బనారస్ హిందూ యూనివర్శిటీ (వారణాసి) ది బెస్ట్‌గా గుర్తింపు సాధించాయి.
రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల జాబితాలో..
ఈ కేటగిరీలో చెన్నైలోని అన్నా యూనివర్సిటీది టాప్ పొజీషన్. ఆ తరువాత జాదవ్‌పూర్ యూనివర్సిటీ- కోల్‌కత, సావిత్రీబాయి ఫూలే పూణే విశ్వవిద్యాలయం- పూణే, కలకత్తా విశ్వవిద్యాలయం- కోల్‌కత, పంజాబ్ విశ్వవిద్యాలయం- చండీగఢ్, ఉస్మానియా యూనివర్సిటీ- హైదరాబాద్, ఆంధ్ర యూనివర్శిటీ- విశాఖపట్నం, భారతియార్ విశ్వవిద్యాలయం- కోయంబత్తూరు, కేరళ విశ్వవిద్యాలయం తిరువనంతపురం, క్యుసాట్- కొచ్చిన్.. ఉన్నాయి.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications