IIT Dhanbadలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు: మంచి జీతం..రేపే చివరిరోజు..!!

ఒకప్పుడు ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్‌గా పిలువబడి ఇప్పుడు ఐఐటీ ధన్‌బాద్‌గా వెలుగొందుతున్న సంస్థలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఐఐటీ ధన్‌బాద్‌లో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులన్నీ శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. సెవెన్త్ పే మాట్రిక్స్ లెవెల్ -3 ప్రకారం ఈ పోస్టులకు వేతనం చెల్లిస్తారు. ఐఐటీ ధన్‌బాద్‌‌లో వెలువడిన జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు వేతనంగా నెలకు రూ. 21-700 నుంచి రూ.69,100 చెల్లిస్తారు. ఇక పోస్టుల ఖాళీల సంఖ్య విషయానికొస్తే... ఐఐటీ ధన్‌బాద్‌లో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల ఖాళీలు మొత్తం 73గా ఉన్నాయి. ఇప్పుడు ఈ 73 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

IIT Dhanbad Recruitment 2021:Apply for junior assistant posts

ఐఐటీ ధన్‌బాద్ విడుదల చేసిన జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు కావాల్సిన విద్యార్హతలు ఇలా ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి 55శాతం మార్కులతో డిగ్రీ కలిగి ఉండాలి. ఇక కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండటమే కాకుండా ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్‌ పై అవగాహన కలిగి ఉండాలి. దీంతో పాటుగా ఇంగ్లీషులో నిమిషానికి 40 పదాలు హిందీలో నిమిషానికి 35 పదాలు టైప్ చేయగల సామర్థ్యం అభ్యర్థులకు ఉండాలి.

ఐఐటీ ధన్‌బాద్ విడుదల చేసిన జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అభ్యర్థుల వయస్సు గరిష్టంగా 30 ఏళ్లుగా నిర్ణయించింది. అయితే ఎస్సీ/ఎస్టీ/ ఓబీసీ-నాన్ క్రీమీలేయర్, దివ్యాంగులకు ప్రభుత్వం సూచించిన మినహాయింపులు ఉంటాయని నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. ఐఐటీ ధన్‌బాద్‌లో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా జరిగే ఎంపిక విధానం ఇలా ఉంది. మొత్తం మూడు స్టేజెస్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ముందుగా స్క్రీనింగ్ టెస్టు ఇది క్వాలిఫై అయితే చాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఆ తర్వాత ట్రేడ్ టెస్టు ఇందులో కూడా అభ్యర్థులు క్వాలిఫై కావాల్సి ఉంటుంది. తర్వాత మెయిన్ పరీక్ష ఉంటుంది.

ఐఐటీ ధన్‌బాద్ కోసం అన్ని అర్హతలు ఉండి అప్లయ్ చేస్తున్న అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.అయితే ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులైన అభ్యర్థులకు ఈ అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపును ఇస్తోంది. ఐఐటీ ధన్‌బాద్‌లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసేందుకు చివరి తేదీ 31 ఆగష్టు 2021. కాబట్టి అభ్యర్థులు వెంటనే దరఖాస్తులు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+