IITH recruitment: ఫ్యాకల్టీ పోస్టుల కోసం అప్లై చేయండి, జీతం లక్షపైనే
హైదరాబాద్: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్(ఐఐటీహెచ్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్ క్యాంపస్‌లో ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు:
నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, బయోమెడికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, డిజైన్, మ్యాథమేటిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వంటి పోస్టులు ఉన్నాయి.
పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. దీంతో పాటు అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
అభ్యర్థుల వయసు 35 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు:
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అభ్యర్థులను మొదట అకడమిక్ అర్హత, పని అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 1,01,500 నుంచి రూ. 1,59,100 వరకు చెల్లిస్తారు.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 15-04-2022
పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://iith.ac.in/ సందర్శించండి
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
-
మూసీ తీరాన మహత్తరం -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది!












Click it and Unblock the Notifications