Income Tax : ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగాలు.. జనవరి 19 లాస్ట్ డేట్..
Income Tax : ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగాలు.. జనవరి 19 లాస్ట్ డేట్ : ఇన్‌కం టాక్స్ డిపార్ట్ మెంట్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. ముంబయిలోని ఆదాయపు పన్ను శాఖ ముంబయి రీజియన్ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 291 స్పోర్ట్స్ కోటా పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల కోసం క్రీడాకారుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ పోస్టులకు అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు అప్లయ్ చేసుకునేందుకు జనవరి 19, 2024 చివరి తేది. కాబట్టి అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు త్వరపడండి.
పోస్టుల వివరాలు
ఖాళీగా ఉన్న పోస్టులు మొత్తం : 291
ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కం టాక్స్ (ఐటీఐ): 14 పోస్టులు
స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II (స్టెనో): 18 పోస్టులు
టాక్స్ అసిస్టెంట్ (టీఏ): 119 పోస్టులు
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్): 137 పోస్టులు
క్యాంటీన్ అటెండెంట్ (సీఏ): 3 పోస్టులు

వివరాలు..
విద్యార్హతలు : పోస్టులను బట్టి 10వ తగరతి, ఇంటర్, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత క్రీడాంశంలో ప్రతిభావంతులైన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరు.
వయసు : 01-01-2023 నాటికి ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కం టాక్స్‌కు 18-30 ఏళ్లు ఉండాలి.
స్టెనోగ్రాఫర్‌కు 18-27 ఏళ్ల వయసు ఉండాలి. టాక్స్ అసిస్టెంట్‌కు 18-27 ఏళ్లు.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కు 18-25 ఏళ్లు.
క్యాంటీన్ అటెండెంట్‌కు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.
శాలరీ : క్యాంటీన్ అటెండెంట్/ ఎంటీఎస్ పోస్టులకు గాను నెలకు రూ.18,000-56,900 ఉంటుంది.
స్టెనోగ్రాఫర్/ ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులకు నెలకు రూ.25,500-81,100 ఉంటుంది.
ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కం టాక్స్‌కు పోస్టులకు నెలకు రూ.44,900-1,42,400 ఉంటుంది.
ఏఏ క్రీడలు : ఆర్చరీ, అథ్లెటిక్స్, అట్యా - పాట్యా, బ్యాడ్మింటన్, బాల్-బ్యాడ్మింటన్, బేస్ బాల్, బాస్కెట్‌బాల్, నెట్ బాల్, పోలో, పవర్ లిఫ్టింగ్, బాక్సింగ్, బ్రిడ్జ్, క్యారమ్, చెస్, క్రికెట్, సైక్లింగ్, ఫెన్సింగ్, ఫుట్‌బాల్ తదితర క్రీడాంశాలున్నాయి.
అప్లయ్ చేసుకునే విధానం: ఆన్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.200.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 19, 2024
పూర్తి వివరాల కోసం https://incometaxmumbai.gov.in/ ఈ వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు.












Click it and Unblock the Notifications