Income Tax శాఖలో 155 పోస్టులకు నోటిఫికేషన్: మంచి జీతం- అర్హులు ఎవరంటే..?

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్. ఇన్‌కమ్‌టాక్స్ డిపార్ట్‌మెంట్‌ ముంబై పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ఇన్‌కమ్ టాక్స్ ఇన్స్‌పెక్టర్, టాక్స్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వేకెన్సీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులు మొత్తం 155గా ఉన్నాయి. విడివిడిగా చూసినట్లయితే ఇన్‌కమ్ టాక్స్ ఇన్స్‌పెక్టర్ పోస్టులు 8 ఉండగా టాక్స్ అసిస్టెంట్ పోస్టులు 83, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 64 పోస్టులు ఉన్నాయి. అయితే ఈ ఉద్యోగాలన్నీ స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేయనున్నారు.

ఇక ఈ మూడు పోస్టులకు సంబంధించి అర్హతలు ఇలా ఉన్నాయి.

ఇన్స్‌పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్ : గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత

టాక్స్ అసిస్టెంట్: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత. ఇక గంటకు 8వేల పదాలు టైప్ చేసే సామర్థ్యం ఉండాలి

Income Tax Recruitment 2021:Apply for 155 Inspector,Tax Assistant,MTS jobs

మల్టీ టాస్కింగ్ స్టాఫ్: గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్శిటీ నుంచి 10వ తరగతిలో ఉత్తీర్ణత

వయస్సు: ఇక మూడు పోస్టులకు అర్హులైన అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లు మధ్య ఉండాలి. అయితే నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా వయస్సు 1 ఆగష్టు 2021 నాటికి ఉండాలి.ఇక రిజర్వేషన్లు ప్రభుత్వం నిబంధనల మేరకు అమలవుతాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చేయాలి. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసేందుకు ముందుగా www.incometaxmumbai.in అనే ఈ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 25 ఆగష్టు 2021.

స్పోర్ట్స్ కోటాలో అథ్లెటిక్స్, స్విమ్మింగ్, స్క్వాష్, బిలియర్డ్స్, చెస్, క్యారమ్, బ్రిడ్జ్, బ్యాడ్మింటన్, లాన్ టెన్నిస్, టేబుల్ టెన్నిస్, షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, బాక్సింగ్, జూడో విభాగాల్లో ఈ నియామకాలు జరుగుతున్నాయి.

వేతనం:
ఇన్స్‌పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్ : నెలకు రూ.44900 -రూ.142400

టాక్స్ అసిస్టెంట్ : నెలకు రూ.25500 -రూ.81100

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ : నెలకు రూ. 18000-రూ.56900

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+