విసాలపై కేంద్రం కొత్త నిర్ణయం..
Students Visa: విసాలపై కేంద్ర ప్రభుత్వం కొత్త నిర్ణయాన్ని తీసుకుంది. చదువుకోడానికి మనదేశానికి వచ్చే విదేశీ విద్యార్థులకు మరిన్ని సౌకర్యాలను కలిగించింది. ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసింది కేంద్ర ప్రభుత్వం. విసాల జారీ ప్రక్రియలో కొత్తగా రెండు కేటగిరీలను చేర్చింది.
ఇ-స్టూడెంట్ విసా, ఇ-స్టూడెంట్ విసా- ఎక్స్ విసా అనే రెండు కేటగిరీలను నేటి నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. స్టడీ ఇన్ ఇండియా (ఎస్ఐఐ) పోర్టల్‌లో వీటిని చేర్చింది. ఈ మేరకు కేంద్ర హోమ్ మంత్రత్వ శాఖ కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ రెండు కేటగిరీలను చేర్చడానికి పోర్టల్‌లో స్వల్పంగా మార్పులు చేర్పులు చేసినట్లు వివరించింది.

దేశంలో గుర్తింపు పొందిన/ఎస్ఐఐ పోర్టల్‌లో నమోదు చేసుకున్న ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం పొందిన విదేశీ విద్యార్థులకు ఈ రెండు కేటగిరీలో అందుబాటులో ఉంటాయి. దీనివల్ల- భారత్‌కు వచ్చే విదేశీ విద్యార్థులు వివిధ దీర్ఘకాలిక లేదా స్వల్ప కాలిక విద్యా కోర్సుల్లో ప్రవేశం పొందే ప్రక్రియను మరింత సులభతరమైంది.
సాధారణంగా భారత్‌కు వచ్చే విదేశీ విద్యార్థులు తప్పనిసరిగా తమ వివరాలు, విసా ప్రక్రియ అనుమతుల కోసం https://indianvisaonline.gov.in/ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులను దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎస్ఐఐ పోర్టల్ ద్వారా వీసా ప్రాసెసింగ్‌తో పాటు అడ్మిషన్ల కోసం ఇక్కడి ఉన్నత విద్యా సంస్థల్లో దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరి.
ఎస్ఐఐ పోర్టల్‌లో ఆమోదం లభించిన తరువాతే విద్యార్థులు ఇ-స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్-గ్రాడ్యుయేట్, డాక్టోరల్ స్థాయిలో వారి కోర్సు వ్యవధి కోసం మంజూరు అవుతాయి. కోర్సును బట్టి అయిదు సంవత్సరాల వరకు చెల్లుబాటు అయ్యేలా విసా జారీ అవుతుంది. ఆ తరువాత దీన్ని పొడిగించుకునే సౌకర్యం అందుబాటులో ఉంది.
ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, సైన్సెస్, లా, అగ్రికల్చర్, హ్యుమానిటీస్ వంటి వివిధ రంగాలలో 8,000 కంటే ఎక్కువ కోర్సుల్లో చదువుకోవడానికి ఏటా లక్షల సంఖ్యలో విదేశీ విద్యార్థులు తమ దరఖాస్తులను స్టడీ ఇన్ ఇండియా పోర్టల్ ద్వారా దాఖలు చేస్తుంటారు. విదేశీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా దీన్ని అందుబాటులోకి వచ్చింది కేంద్రం.












Click it and Unblock the Notifications