ఇండియా పోస్ట్‌ జీడీఎస్ 2024 ఫ‌లితాలు వ‌చ్చేశాయ్‌.. ఇలా చెక్ చేసుకోండి..

దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న 44,228 జీడీఎస్ ఉద్యోగాల ఫ‌లితాలు తాజాగా విడుద‌ల‌య్యాయి. ఈ ఉద్యోగాల‌కు ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే, పదో తరగతిలో వ‌చ్చిన‌ మార్కుల ఆధారంగానే మెరిట్ జాబితా విడుద‌ల చేస్తార‌నే సంగ‌తి తెలిసిందే. ఈ మెరిట్ లిస్ట్ తాజాగా విడుదలయింది. ఈ ప‌రీక్ష‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థులు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి నేరుగా చెక్ చేసుకోగ‌ల‌రు. అభ్య‌ర్థులు https://indiapostgdsonline.gov.in/ ఈ వెబ్‌సైట్‌ను సంప్ర‌దించ‌గ‌ల‌రు.

ఈ మెరిట్ జాబితా ప్రకారం ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఇండియా పోస్ట్ ఈ-మెయిల్‌ ద్వారా లేదంటే ఫోన్‌ నంబర్‌కు మెసేజ్ పంపుతారు. లేదంటే పోస్టు ద్వారా కూడా తెలియ‌జేస్తారు. మొదటి సెలక్షన్ జాబితాలో ఎంపికైన అభ్యర్థులు ఏవైనా ఇత‌ర కారణాల వల్ల విధుల్లో చేరకపోతే రెండో జాబితాను విడుదల చేస్తారు. రెండో జాబితాలో కూడా ఏవైనా ఖాళీలు ఏర్పడితే మూడో జాబితా ఉంటుంది. ఇందులోనూ ఖాళీలుంటే నాలుగో జాబితా విడుదల చేస్తారు.

India Post GDS 2024 Result is here Check this

గత సంవ‌త్స‌రం ఇండియా పోస్ట్‌లో నాలుగు సెలక్షన్ జాబితాలు విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ప‌దోత‌ర‌గ‌తిలో వ‌చ్చిన మార్కులు లేదా గ్రేడ్ మెరిట్ ఆధారంగా ప్రకటనలో అభ్యర్థి ఎంపిక చేసుకున్న బ్రాంచీ, హోదా, ప్రాధాన్యం ప్రకారం ఇండియా పోస్ట్ ఆఫీసులో ఏదో ఒకచోట పోస్టింగ్ ఇవ్వ‌డం జ‌రుగుతుంది. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ సిస్టమ్‌ జనరేటెడ్‌ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయ‌డం జ‌రుగుతుంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో...

ఏపీలో మొత్తం 1,355 జీడీఎస్‌ పోస్టులు ఉండగా, తెలంగాణలో 981 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక‌, ఈ ఉద్యోగాల కోసం జులై 15వ తేది నుంచి అప్లికేష‌న్లు స్వీక‌రించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ ఉద్యోగాలు తొలి జాబితాను అధికారులు విడుదల చేశారు. మొద‌టి సెల‌క్ష‌న్ జాబితాలో ఏపీ నుంచి 1355 మంది అభ్యర్థులు, తెలంగాణ రాష్ట్రం నుంచి 981 మంది అభ్యర్థులు షార్ట్‌ లిస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+