India Post recruitment 2021: జీతం రూ. 50వేలపైనే, వెంటనే అప్లై చేయండి
న్యూఢిల్లీ: ఇండియన్ పోస్ట్ పలు ఖాళీల భర్తీకి తాజాగా ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసింది. ఢిల్లీ పోస్టల్ సర్కిల్‌లో పోస్టల్ అసిస్టెంట్, సర్టింగ్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ పోస్ట్, పోస్ట్ మ్యాన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఇవి స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్న పోస్టులు కావడం గమనార్హం.
221 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. క్రీడల్లో రాణించినవారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇక వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించింది. కాగా, ఈ పోస్టులకు ఆఫ్‌లైన్ పద్ధతిలోనే అంటే పోస్టు ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇండియన్ పోస్టు రిక్రూట్‌మెంట్ 2021కు సంబంధించిన ముఖ్య విషయాలు:
దరఖాస్తు ప్రారంభం- అక్టోబర్ 4, 2021
దరఖాస్తుకు చివరి తేదీ- నవంబర్ 12, 2021
అర్హతలు: అభ్యర్థులకు నోటిఫికేషన్‌లో సూచించిన విద్యార్హతలతో పాటు క్రీడార్హతలు కూడా ఉండాలి.
వయోపరిమితి: పోస్ట్‌మ్యాన్, పోస్టల్ అసిస్టెంట్, సర్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు 18 నుంచి 27 ఏళ్లు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్లు.
దరఖాస్తు ఫీజు: రూ.100
జీతం వివరాలు
పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు రూ.25,500 (బేసిక్ వేతనంతో) రూ.81,100
పోస్ట్‌మ్యాన్ పోస్టుకు రూ.21,700 (బేసిక్ వేతనంతో) రూ.69,100
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుకు రూ.18,000 (బేసిక్ వేతనంతో) రూ.56,900 వేతనం లభిస్తుంది.
ఇండియా పోస్ట్ రిక్రూట్‌మెంట్ దరఖాస్తు విధానం
మొదటగా..
అభ్యర్థులు https://www.indiapost.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
జాబ్ నోటిఫికేషన్‌లోనే దరఖాస్తు ఫార్మట్ ఉంటుంది.
అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని పూర్తి చేయాలి.
అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి.
దరఖాస్తుల్ని నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా చేరేలా స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్టులో పంపాలి.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
Assistant Director (R&E),
O/o the Chief Postmaster General,
Delhi Circle, Meghdoot Bhawan,
New Delhi-110001.
ఈ జాబ్ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, దరఖాస్తు కోసం ఇక్కడి క్లిక్ చేయండి












Click it and Unblock the Notifications