ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ‘సీ’ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్: వెంటనే అప్లై చేయండి
న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్).. గ్రూప్ సి సివిలియన్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తును సంబంధిత స్టేషన్‌లు/యూనిట్‌లకు పంపడం ద్వారా పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ సంస్థలోని 5 కుక్ పోస్టులను భర్తీ చేస్తుంది.
'ఎంప్లాయ్‌మెంట్ న్యూస్/ రోజ్‌గార్ సమాచార్'లో ఈ ప్రకటన ప్రచురించబడిన తేదీ నుంచి 30 రోజులు పోస్ట్ కోసం దరఖాస్తు చేయడానికి చివరి తేదీ అని అభ్యర్థులు గమనించాలి.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్‌మెంట్ 2021: ఖాళీ వివరాలు:
కుక్ OG, ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ AF బీదర్ - 2
కుక్ OG, కమాండెంట్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాద్ - 3

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్‌మెంట్ 2021: అర్హత ప్రమాణాలు:
అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్‌లో ఉత్తీర్ణులై ఉండాలి, క్యాటరింగ్‌లో సర్టిఫికేట్ లేదా డిప్లొమా ఉండాలి. ట్రేడ్‌లో 1 సంవత్సరం అనుభవం.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్‌మెంట్ 2021: వయో పరిమితి:
పోస్ట్ కోసం దరఖాస్తు చేయడానికి అభ్యర్థి తప్పనిసరిగా 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్‌మెంట్ 2021: ఎంపిక ప్రక్రియ
షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను వ్రాత పరీక్షకు పిలుస్తారు. రాత పరీక్ష జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్, ట్రేడ్/పోస్ట్ సంబంధిత ప్రశ్నల ఆధారంగా ఉంటుంది.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్‌మెంట్ 2021 నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
(http://davp.nic.in/WriteReadData/ADS/eng_10801_31_2122b.pdf)












Click it and Unblock the Notifications