JObs: ఎన్‌సీసీ క్యాడెట్లకు బంపర్ ఆఫర్.. ఆర్మీ ప్రత్యేక నోటిఫికేషన్.. దరఖాస్తు చేసుకోండిలా..
ఇండియన్ ఆర్మీ 55 ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ పోస్టుల భర్తీకి ప్రకటనలు విడుదల చేసింది
ఇండియన్ ఆర్మీ ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ పోస్టుల భర్తీకి ప్రకటనలు విడుదల చేసింది. సాధారణంగా ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో ఏడాదికి రెండుసార్లు ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ పోస్టుల భర్తీకి ప్రకటనలు విడుదల చేస్తోంటుంది. దీనికి డిగ్రీతోపాటు ఎన్‌సీసీ అర్హత ఉన్నవారు అర్హులు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల అకడమిక్ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్టు చేస్తారు. ఇలా ఎంపిక చేసిన వారిని సెలక్షన్ కేంద్రాల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఏపీ, తెలంగాణ అభ్యర్థులకు బెంగళూరులో మౌకిక పరీక్ష ఉండనుంది.

స్టేజ్ 2
సైకాలజిస్ట్, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్, ఇంటర్వ్యూ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ పరీక్ష నిర్వహిస్తారు. తొలిరోజు స్టేజ్-1లో ఉత్తీర్ణులైనవారే తర్వాతి 4 రోజులు నిర్వహించే స్టేజ్ 2 ఇంటర్వ్యూకు అర్హత సాధిస్తారు. ఇందులో ఎంపికైతే వైద్య పరీక్షలు నిర్వహించి, శిక్షణ ఇస్తారు. ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ విధానంలో ఎంపికైనవారికి ఈ ఏడాది అక్టోబరు నుంచి ఆఫీసర్స్ ట్రైనింగ్ ఇస్తారు. ఈ శిక్షణ చెన్నైలో 49 వారాల పాటు ఉంటుంది. ఈ సమయంలో ప్రతి నెలా రూ.56,100 స్టైపెండ్ ఇస్తారు.

మద్రాస్ యూనివర్సిటీ
విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారికి పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ డిగ్రీని మద్రాస్ యూనివర్సిటీ నుంచి అందిస్తారు. అనంతరం లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఇలా చేరినవారు పదేళ్లపాటు ఉద్యోగంలో కొనసాగేందుకు అవకాశం ఉంటుంది. వ్యవధి పూర్తయిన తర్వాత సంస్థ అవసరాలు, అభ్యర్థుల ఆసక్తుల ప్రకారం కొందరిని శాశ్వత ఉద్యోగిగా తీసుకునే అవకాశం ఉంటుంది.

55 పోస్టులు
55 పోస్టులకు ప్రస్తుతం నోటిఫికేషన్ ఇ్చచారు. ఇందులో 50 పురుషులకు కేటాయించగా.. 5 మహిళలకు కేటాయించారు. ఎన్ సీసీతో పాటు డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులు వచ్చిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా అప్లయి చేసుకోవచ్చు.
ఎన్‌సీసీ సి సర్టిఫికెట్‌లో కనీసం బి గ్రేడ్ అయినా పొంది ఉండాలి. అభ్యర్థుల వయస్సు జులై 1, 2023 నాటికి 19 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. ఫిబ్రవరి 15 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు.
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications