GOVT JOBS: ఇంటర్ అర్హతతో నెలకు రూ. 1.2 లక్షల జీతం ఇచ్చే జాబ్స్
చదవడానికి ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇది నిజం. అసలే ఉద్యోగాల కోసం నిరుద్యోగులు అంతా ఓ వైపు యుద్ధాలు చేస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఓ తీపి కబురు ప్రకటించింది. ఇంటర్ అర్హత తోనే నెలకు 1.2 లక్షల జీతం సంపాదించవచ్చు. అందుకు మీకు దేశసేవ చేయాలనే ఆసక్తి కూడా ఉంటే ఈ సువర్ణావకాశం మీకోసమే.. ఇండియన్ కోస్ట్ గార్డ్ విభాగంలో 170 అసిస్టెంట్ కమాండెంట్ (Assistant Commandant) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హత, పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
Assistant Commandant పోస్టుల వివరాలు..
మొత్తం ఖాళీలు..
170
పోస్టులు..
జనరల్ డ్యూటీ (General Duty)
టెక్నికల్ (Mechanical/ Electrical/ Electronics)
కమర్షియల్ పైలట్ ఎంట్రీ (CPL-SSA)
లా ఎంట్రీ
యానెడ్ (Yantrik Branch)

అర్హతలు..
జనరల్ డ్యూటీ..
ఇంటర్మీడియట్/ 12వ తరగతి వరకు గణితం, ఫిజిక్స్ సబ్జెక్టులుగా చదివి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీ (ఇలాంటి కోర్సులు: B.Sc, B.Com + PCM in 10+2, BBA, etc.) వయసు 21 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ సర్వీసులో ఉండేవారికి (Coast Guard/ Army/ Navy/ Air Force) 5 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.
టెక్నికల్ బ్రాంచ్..
సంబంధిత ఇంజినీరింగ్ విభాగాల్లో బీఈ/బీటెక్ పూర్తి చేసి ఉండాలి. వయసు 21 నుంచి 25 సంవత్సరాలు మధ్య ఉండాలి. 5 ఏళ్ల సడలింపు వర్తిస్తుంది
CPL (SSA) ఎంట్రీ..
+2 లో ఫిజిక్స్, మాథ్స్ సబ్జెక్టులతో పాటు Commercial Pilot License (CPL) ఉండాలి. వయస్సు 19 నుంచి 25 సంవత్సరాలు మధ్య ఉండాలి.
లా ఎంట్రీ..
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి LLB పూర్తి చేసి ఉండాలి. వయస్సు 21 నుంచి 30 సంవత్సరాలు మధ్య ఉండాలి.
ఎంపిక విధానం..
స్టేజ్-I: రాత పరీక్ష (చాలా పోటీగా ఉంటుంది - PCM, English, Reasoning, GK, Numerical Aptitude)
స్టేజ్-II: PSB - Cognitive Battery Test, Picture Perception, Group Discussion
స్టేజ్-III: FSB - Group Task, Interview, Psychological Tests
స్టేజ్-IV: వైద్య పరీక్ష - Fitness Assessment
స్టేజ్-V: ఫైనల్ మెరిట్ ప్రకారం ట్రైనింగ్ & ఇండక్షన్
జీతం..
అసిస్టెంట్ కమాండెంట్: రూ.56,100 (Pay Level 10)
డిప్యూటీ కమాండెంట్ : రూ.67,700
కమాండెంట్ (JG): రూ.78,800
కమాండెంట్ : రూ.1,23,100
భత్యాలు, ఎల్‌టీసీ, మెడికల్, గృహ భత్యం తదితర సౌకర్యాలు అదనంగా ఉంటాయి
దరఖాస్తు తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: ఇప్పటికే ప్రారంభమైంది
చివరి తేదీ..
జూలై 23, 2025
అప్లికేషన్ ఫీజు..
రూ.300 జనరల్/ OBC అభ్యర్థులకు
SC/ST అభ్యర్థులకు ఫీజు మినహాయింపు
దరఖాస్తు విధానం..
అధికారిక వెబ్‌సైట్ https://joinindiancoastguard.cdac.in ద్వారా అప్లై చేసుకోవాలి. "Assistant Commandant 2025 Batch" సెక్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి.. మీ డిటైల్స్ నమోదు చేసి, అవసరమైన సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయండి. తర్వాత ఫీజు చెల్లించి, Submit చేయండి
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!!












Click it and Unblock the Notifications