Indian Navyలో ఐటీ ఉద్యోగాలు: చివరి తేదీ ఇదే.. పూర్తి వివరాలు మీకోసం..!
భారత నేవీ అవివాహితులైన పురుషుల కోసం ఐటీలో ఉద్యోగ భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా జనవరి 2022లో ప్రారంభం అయ్యే నేవల్ ఓరియెంటేషన్ కోర్సును ప్రారంభించనుంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 16 జూలై 2021.
సంస్థ పేరు: ఇండియన్ నేవీ
పోస్టు పేరు: ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్
పోస్టుల సంఖ్య: 45
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 16 జూలై 2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ ఇంజినీరింగ్/ఐటీలో 60శాతం ఉత్తీర్ణతతో బీఈ లేదా బీటెక్. లేదా ఎంసీఏ/ఎంటెక్
వయస్సు: 1997 జనవరి 02 నుంచి 2002 జూలై 1న జన్మించి ఉండాలి
ఎంపిక ప్రక్రియ: ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది
అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ తేదీ: 02 జూలై 2021
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 16 జూలై 2021
మరిన్ని వివరాలకు :
లింక్: http://www.joinindianarmy.nic.in/












Click it and Unblock the Notifications