ఇండియన్ నేవీలో ఉద్యోగాలు: జీతం రూ.1.77 లక్షలు: అర్హతలు ఇవే..!!

దేశానికి సేవ చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్ తెలిపింది రక్షణ శాఖ. రక్షణ శాఖ పరిధిలో ఉండే ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్‌‌లో పలు పోస్టులను భర్తీ చేసేందుకు ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా సబ్ లెఫ్ట్‌నెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 181 పోస్టులను నోటిఫై చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

జనరల్ సర్వీస్ హైడ్రో కేడర్‌లో 45 పోస్టులు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటీసీ)4 పోస్టులు, అబ్జర్వర్ 8 పోస్టులు, పైలట్ 15 పోస్టులు, లాజిస్టిక్స్ 18 పోస్టులు, ఎడ్యుకేషన్ 18 పోస్టులు, ఇంజినీరింగ్ బ్రాంచ్ జనరల్ సర్వీస్‌ 27 పోస్టులు,ఎలక్ట్రికల్ జనరల్ సర్వీస్ 34 పోస్టులు, నేవల్ ఆర్కిటెక్ట్ 12 పోస్టులను భర్తీ చేసేందుకు ఇండియన్ నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక విద్యార్హతల విషయానికొస్తే ఆయా పోస్టులకు సూచించిన విధంగా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి 60శాతం ఉత్తీర్ణతతో బీఈ/బీటెక్ డిగ్రీ ఉండాలి. ఏ బ్రాంచ్‌కు ఆ బ్రాంచ్‌లో స్పెషలైజేషన్ కలిగి ఉండాలి. విద్యార్హతలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ చూడగలరు.వేతనం నెలకు రూ. 56,100/- నుంచి 1,77,500/- ఉంటుంది.

Indian Navy had released a notification to fill up sub lieutenant posts.

అభ్యర్థుల వయస్సు విషయానికొస్తే పైన పేర్కొన్న పోస్టుల్లో ఒక అబ్జర్వర్ మరియు పైలట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి 02 జూలై 1998 - జూలై 2003 మధ్య జన్మించి ఉండాలి. ఇక మిగతా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 02 జూలై 1997-1 జనవరి 2003 మధ్య జన్మించి ఉండాలి. వయస్సు గురించి మరింత స్పష్టత కోసం అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ చూడగలరు.

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఎస్‌ఎస్‌బీ ద్వారా జరుగుతుంది. ఇక్కడ అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించక్కరలేదని నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది ఇండియన్ నేవీ. ఇక ఆన్‌లైన్ ద్వారా అభ్యర్థులు అప్లికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ 18 సెప్టెంబర్ 2021. అప్లికేషన్ ఆన్‌లైన్ ద్వారా పూర్తి చేసేందుకు చివరితేదీ 5 అక్టోబర్ 2021. మరిన్ని వివరాలకు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి: www.joinindiannavy.gov.in

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+