Indian Navy: 2500 సెయిలర్ పోస్టుల కోసం వెంటనే అప్లై చేయండి
న్యూఢిల్లీ: ఇండియన్ నేవీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇండియన్ నేవీలో 2500 సెయిలర్ పోస్టుల భర్తీ చేయనుంది. 2022 ఆగస్టు బ్యాచ్ ద్వారా ఆర్టిఫిషర్ అప్రెంటీస్ (ఏఏ), సీనియర్ సెకండరీ రిక్రూట్స్ (ఎస్ఎస్ఆర్) పోస్టులను భర్తీ చేయనుంది. అవివాహిత పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ (ఎంపీసీ) అర్హతతోనే ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
నేవీలో ప్రధానంగా ఆఫీసర్స్, సెయిలర్స్, సివిలియన్స్ మూడు రకాల పోస్టులు ఉంటాయి. ఆఫీసర్స్ పోస్టులను యూపీఎస్సీ డిఫెన్స్ సర్వీస్, నేవల్ అకాడమీ ద్వారా భర్తీ చేస్తుండగా.. సెయిలర్స్, సివిలియన్స్ పోస్టులకు ఇండియన్ నేవీ విడిగా నోటిఫికేషన్స్ ద్వారా భర్తీ చేస్తుంది. ప్రస్తుతం 2022 ఆగస్టు బ్యాచ్ ద్వారా సెయిలర్స్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://www.joinindiannavy.gov.in/ చూడవచ్చు.

మొత్తం ఖాళీలు: 2500
ఆర్టిఫిషర్ అప్రెంటీస్ (ఏఏ) - 500
సీనియర్ సెకండరీ రిక్రూట్స్ (ఎస్‌ఎస్ఆర్) - 2000
ఆర్టిఫిషర్ అప్రెంటిస్ (ఏఏ)- 500
విద్యార్హత:
ఇంటర్మీడియెట్/10+2లో కనీసం 60శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్‌తో పాటు కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్ సైన్స్ చదివి ఉండాలి.
వయోపరిమితి:
2002 ఆగస్టు 1 నుంచి 2005 జులై 31 మధ్య జన్మించి ఉండాలి.
సీనియర్ సెకండరీ రిక్రూట్స్(ఎస్‌ఎస్‌ఆర్)- 2000
విద్యార్హత:
ఇంటర్మీడియెట్/10+2లో కనీసం 60శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్‌తో పాటు కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్ సైన్స్ చదివి ఉండాలి.
వయోపరిమితి:
2002 ఆగస్టు 1 నుంచి 2005 జులై 31 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ఫీజు: రూ.215. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మార్చి 29, 2022
దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్ 5, 2022
కోర్సు ప్రారంభం: ఆగస్టు 2022
ఎంపిక ప్రక్రియ:
ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ ఎగ్జామ్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామ్ మూడు దశల్లో ఎంపిక జరుగుతుంది. ఆర్టిఫిషర్ అప్రెంటీస్ కు దేశవ్యాప్తంగా నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ టెస్టులో మెరిట్, సీనియర్ సెకండరీ రిక్రూట్స్‌కు స్టేట్‌వైజ్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ టెస్టులో అర్హత సాధించిన కనీసం 10 వేల మందిని ఫిజికల్ టెస్టులకు ఎంపిక చేస్తారు. ఇందులో క్వాలిఫై అయిన వారికి మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో అనర్హత పొందిన వారు 21 రోజుల లోపు రూ.40 చెల్లించి మిలిటరీ హాస్పిటల్‌లో రివ్యూ కోరవచ్చు.
పరీక్ష విధానం:
ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో 100 మార్కులకు 100 ప్రశ్నలిస్తారు. సమయం 60 నిమిషాలు. ఇంటర్ స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మీడియంలలో ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ ఉంది. ఒక తప్పు సమాధానానికి ¼ మార్కు మైనస్ అవుతుంది. సెక్షనల్ కటాఫ్‌తో పాటు ఓవరాల్ కటాఫ్ మార్కులు పొందాలి.
ఫిజికల్, మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్:
ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. 7 నిమిషాల్లో 1.6 కిలోమీటర్లు పరిగెత్తడంతో పాటు 20 సిట్‌అప్స్, 10 పుష్ అప్స్ తీయాల్సి ఉంటుంది. క్రీడలు, స్విమ్మింగ్, ఇతర కర్రిక్యులర్ యాక్టివిటీస్‌లో సర్టిఫికెట్ కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
కనీసం 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. గాలి పీల్చినప్పుడు చాతీ 5 సెం.మీ. విస్తరించాలి. చెవులు, దంతాలు శుభ్రంగా ఉండాలి. అద్దాలు ఉన్నా లేకున్నా కంటిచూపు 6/6 గా ఉండాలి.
ట్రైనింగ్, స్టైఫండ్ వివరాలు:
ఈ పోస్టులకు ఎంపికైన వారికి ఆగస్టు 2022లో ప్రారంభమయ్యే ఈ బ్యాచ్‌లో ఏఆర్ అభ్యర్థులకు 9 నెలలు, ఎస్ఎస్ఆర్ అభ్యర్థులకు 22 నెలల పాటు ఐఎన్ఎస్ చిల్కా కేంద్రంలో ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్‌లో నెలకు రూ. 14,600 స్టైపెండ్ ఉంటుంది. శిక్షణ పూర్తిచేసుకున్నవారిని లెవెల్-3లో 20 ఏళ్ల పాటు (ఎస్ఎస్ఆర్ కు 15 ఏళ్లు) సర్వీసులో నియమిస్తారు. ఈ టైంలో నెలకు రూ.21,700 నుంచి రూ. 69,100 వరకూ పొందవచ్చు. అదనంగా ఇతర అలవెన్సులు ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం ఈ ఉద్యోగానికి కావాల్సిన అర్హతలున్న అభ్యర్థులు వెంటనే అప్లై చేయండి.
-
"ఆర్ఆర్బీ" గుడ్ న్యూస్.. అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు నోటిఫికేషన్..! -
2026 ఏడాదిలో ఫ్రెషర్స్ కోసం టాప్ 10 బెస్ట్ జాబ్స్ ఇవే ..! -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications