Indian Railways Jobs:టీచర్ పోస్టుల నుంచి ఇతర పోస్టుల వరకు నోటిఫికేషన్ - మంచి జీతం..!!

భారతీయ రైల్వేస్ వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న మినిస్టీరియల్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది.అన్ని అర్హతలు కలిగి ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి ఆపై ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.

పోస్టులు-ఖాళీలు

వివిధ సబ్జెక్టుల్లో పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు - 187, సైంటిఫిక్ సూపర్ వైజర్-3, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు-338,చీఫ్ లా అసిస్టెంట్-54,పబ్లిక్ ప్రాసిక్యూటర్-20,ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్‌ట్రక్టర్-18,సైంటిఫిక్ అసిస్టెంట్ / ట్రైనింగ్-2, జూనియర్ ట్రాన్స్‌లేటర్ (హిందీ)-130,సీనియర్ పబ్లిసిటీ ఇన్స్‌పెక్టర్-3, స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్‌పెక్టర్-59,లైబ్రేరియన్-10, మ్యూజిక్ టీచర్ (మహిళ)-3,ప్రైమరీ రైల్వే టీచర్ -188,అసిస్టెంట్ టీచర్ (మహిళ)-2, లేబొరేటరీ అసిస్టెంట్/స్కూలు-7,
లాబ్ అసిస్టెంట్ గ్రేడ్ III-12. ఇలా మొత్తం 1036 పోస్టులను భర్తీ చేయనుంది.

Indian Railways invites application to fill up posts of Ministerial isolated categories

ఇక ఈ పోస్టులన్నీ సికింద్రాబాద్, అహ్మదాబాద్, అజ్మీర్,బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై,గోరఖ్‌పూర్, గౌహతి, జమ్మూ శ్రీనగర్, కోల్‌కతా, మాల్డా, ముంబై, పాట్నా,ప్రయాగ్‌రాజ్,రాంచీ ఆర్‌ఆర్‌బీ పరిధిలో ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 48 ఏళ్ల మధ్యలో ఉండాలి. రిజర్వేషన్ ఉన్న వారికి మరో మూడేళ్లు అదనం.

అన్ని అర్హతలు కలిగి ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ రైల్వే పరిధిని ఎంచుకుని ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ 7 జనవరి 2025 ఉండగా.. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 6 ఫిబ్రవరి 2025. ఇంకెందుకు ఆలస్యం ముందుగా నోటిఫికేషన్ క్షుణ్ణంగా చదివండి. ఆపై అప్లయ్ చేయండి. ఇండియన్ రైల్వేస్‌లో ఉద్యోగం సంపాదించి మీ బంగారు భవిష్యత్తును తీర్చి దిద్దుకోండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+