Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇన్ఫోసిస్ లో భారీగా లేఆఫ్స్.. బౌన్సర్లు, సెక్యూరిటీ గార్డులతో బలవంతంగా..

ప్రముఖ టెక్ సంస్థ ఇన్ఫోసిస్ మరోసారి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. మైసూరులోని ఇన్ఫోసిస్ క్యాంపస్ ఏకంగా 700 మంది ట్రైనీ ఉద్యోగులకు లే ఆఫ్స్ ప్రకటించినట్లు సమాచారం. వీళ్లంతా నాలుగు నెలల క్రితమే ఉద్యోగంలో చేరినట్లు తెలుస్తోంది. 700 మంది ట్రైనీ ఉద్యోగులను బలవంతంగా తొలగించినట్లు నేసెంట్ ఇన్ఫార్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయిస్ సెనేట్(NITES) అధ్యక్షుడు హర్ ప్రీత్ సింగ్ సలూజా తెలిపారు. ఇన్ఫోసిస్ చర్యలపై కేంద్ర లేబర్ మినిస్టీ కి కంప్లయింట్ చేస్తామని అన్నారు.

పరీక్షల్లో ఫెయిల్..

ఇన్ఫోసిస్ మాత్రం కేవలం 350 ఉద్యోగులను మాత్రమే తొలగించినట్లు పేర్కొంది. ఇంటర్నల్ గా నిర్వహించిన ఎవాల్యూయేషన్ పరీక్షల్లో ఉద్యోగులు ఫెయిల్ అయ్యారని అందుకే ట్రైనీ ఉద్యోగులను తొలగించామని తెలిపింది." ఫ్రెషర్స్ అందరికీ ఎవాల్యూయేషన్ పరీక్షలను క్లియర్ చేయడానికి మూడు ప్రయత్నాలు ఉంటాయి. మూడు ప్రయత్నాల్లోనూ విఫలం అయిన ఫ్రెషర్స్ సంస్థలో కొనసాగేందుకు అనర్హులు అవుతారు. ఇది వాళ్లు జాయిన్ అయిన సమయంలో కాంట్రాక్ట్ ఫామ్ లోనే పేర్కొన్నాం. గత రెండు దశాబ్దాలుగా ఈ విధానం ఇన్ఫోసిస్ కంపెనీలో కొనసాగుతోంది.

Infosys Lays Off Nearly 700 Freshers from Mysore Campus Reports of Forced Dismissals of Bowlers and Security Guards

అయితే కొందరు ఉద్యోగులు మాత్రం తమను తొలగించాలన్న నెపంతోనే కావాలనే పరీక్షలను కఠినతరం చేశారని అందుకే తాము ఉద్యోగం కోల్పోయామని వాపోతున్నారు. ఓ ఉద్యోగి మాట్లాడుతూ.. 'నేను ఈ కంపెనీలో చాలా కాలంగా కష్టపడి పనిచేస్తున్నా. ఒక్క పరీక్షతో ఉద్యోగం కోల్పోతానని అనుకోలేదు'అని తెలిపాడు. ట్రైనింగ్ సమయంలో కంపెనీ తమకు అనుగుణంగా ఫ్రెషర్స్ ను మలుచుకోవాలని అంతేగాని ఇలా అర్థాంతరంగా లేఆఫ్స్ ఇస్తే ఎలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బౌన్సర్లు, బాడీ గార్డులతో బలవంతంగా..

బౌన్లర్లు, బాడీగార్డులతో బలవంతంగా ఇన్ఫోసిస్ కంపెనీ ఫ్రెషర్స్ ను తొలగించిందని నేసెంట్ ఇన్ఫార్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయిస్ సెనేట్(NITES) సంస్థ ఆరోపించింది. ఇన్ఫోసిస్ చర్యలు ఇండస్ట్రీయల్ డిస్పూట్స్ యాక్ట్- 1947కు విరుద్ధం అని ఈ కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+