రూ.56,900 జీతంతో ఇంటెలిజెన్స్ బ్యూరో జాబ్స్.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులంటే ??
ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ ఇంటెలిజెన్స్ బ్యూరో (IB)లో ఉద్యోగాలను భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 362 ఎంటీఎస్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నవంబర్ 22వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 14, 2025 వరకు కొనసాగుతుంది.
కాగా ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు కనీసం పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి విషయానికొస్తే, 2025 డిసెంబర్ 14 నాటికి 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.mha.gov.in లేదా www.ncs.gov.in ను సందర్శించాలి. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

దేశవ్యాప్తంగా నగరాల వారీగా ఖాళీలు..
- ఢిల్లీ - 108 పోస్టులు
- ఇటానగర్ - 25
- శ్రీనగర్ - 14
- త్రివేండ్రం - 13
- లక్నో - 12
- ఐజ్వాల్, భోపాల్ - చెరో 11
- చెన్నై - 10
- గువాహటి, లేహ్ - చెరో 10
- డెహ్రాదూన్, గ్యాంగ్‌టక్ - చెరో 8
- అమృత్‌సర్, భువనేశ్వర్, చండీగఢ్, జమ్మూ, షిల్లాంగ్ - చెరో 7
- హైదరాబాద్ - 6
- కోహిమా, పట్నా, సిలిగురి - చెరో 6
- సిమ్లా - 5
- అహ్మదాబాద్, బెంగళూరు, రాయ్‌పూర్ - చెరో 4
- విజయవాడ - 3 పోస్టులు
- కాళిపొంగ్, వారణాసి - చెరో 3
- మీరట్, నాగ్‌పూర్, పనాజీ, రాంచీ - చెరో 2
- కోల్‌కతా - 1
అర్హతలు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి కనీస అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత
వయస్సు 18 నుండి 25 సంవత్సరాలు (డిసెంబర్ 14, 2025 నాటికి)
వయోపరిమితిలో రిజర్వ్ కేటగిరీలకు సడలింపుల వివరాలు:
OBC: 3 ఏళ్లు
SC, ST: 5 ఏళ్లు
PwBD: 10 ఏళ్ల వరకు
Ex-Servicemenలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అదనపు రాయితీలు పొందుతారు.
దరఖాస్తు రుసుము..
మహిళలకు పూర్తిగా ఉచితం
General / OBC / EWS: ₹650
SC / ST / PwBD / Ex-Servicemen / Women: దరఖాస్తు రుసుము లేదు
ఎంపిక విధానం..
అభ్యర్థుల ఎంపిక రెండు దశల పరీక్షల ద్వారా జరుగుతుంది:
ప్రిలిమినరీ పరీక్ష
మెయిన్స్ పరీక్ష
ఇవి పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్షలు. అభ్యర్థుల సాధారణ జ్ఞానం, రీజనింగ్, న్యూమరికల్ స్కిల్స్, బేసిక్ ఇంగ్లీష్ జ్ఞానం వంటి అంశాలను పరిశీలిస్తారు. ఈ పరీక్షలు పూర్తయ్యాక డాక్యుమెంట్ వేరిఫికేషన్ కూడా ఉంటుంది.
జీతం..
ఈ పోస్టులకు శాలరీ: రూ.18,000 - రూ.56,900 ( ఇది కేంద్ర ప్రభుత్వ పే-లెవల్ ప్రకారం ఉంటుంది )
అదనంగా HRA, DA, TA వంటి ఇతర అలవెన్సులు కూడా లభిస్తుంది. ఉద్యోగం శాశ్వతం కావడంతో, భవిష్యత్తులో పదోన్నతుల అవకాశాలు కూడా ఉన్నాయి.
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!











Click it and Unblock the Notifications